Tummidi-Hatti
-
‘తుమ్మిడిహెట్టి’ కోసం కదిలిన కాంగ్రెస్
సాక్షి, కాగజ్‌నగర్: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో దాదాపుగా 16.5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.38వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ సైతం చేశారు. కెనాల్ పనులు సైతం జరిగాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రీడిజైన్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని మొదటి నుంచి ప్రతిపక్షం వాదిస్తూనే ఉంది. రంగంలోకి రాష్ట్ర నాయకత్వం ఈ నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు పోన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, షేబ్బీర్‌అలీ, జానరెడ్డి, సురేష్ సెట్కార్, కొండ విశ్వేశ్వర్, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్ చేరుకోగా వారికి కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో కుమురంభీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11గంటలకు తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్ చేరుకుని ఇక్కడి నుంచి కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని పరిశీలించడానికి వెళ్లారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత గురించి తెలుసుకుని పరిశీలించారు. -
'మా నీళ్లు మాకే' : కోదండరాం
సాక్షి, మంచిర్యాల: మా నీళ్లు మాకే అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో జలసాదన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత నదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు తాగు, సాగు నీరందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ‘మా నీళ్లు మాకే’ అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో జలసాధన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టల నాయకులు, యువలకుతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ప్రజా సంఘాల నాయకులతో కోదండరాం నాయకులు మాట్లాడుతూ.. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహితనదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు జిల్లాలకు నీరు రాకుండా పోయిందని వారు వాపోయారు. జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలోని ప్రజలకు సాగునీరు లేక కేవలం వర్షాధార పంటలు సాగుచేసుకుంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణం చేపడితే వారి పంటలకు నీరందుతుందన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేశామని కానీ ఇప్పుడు రెండు జిల్లాలకు నీళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వంలో పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని కేవలం హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు నీటిని తరలించడానికే నిర్మించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద 25 వేల కోట్లతో 70 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు ప్రారంభించారని, మరో 30 కిలోమీటర్ల పనులు పనులు చేస్తే పూర్తయ్యే కాలువ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని వివర్శించారు. కేవలం కమీషన్ల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చే సిందనే సాకుతో తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించకుండా ఇక్కడి రైతులను మోసం చేసిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెకులో కలుపవచ్చన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా ముందుకు రావాలని రెండు జిల్లాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని తీర్మానించారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజలపై రూ. 45 వేల కోట్ల అదనపు భారం’
సాక్షి, హైదరాబాద్ : తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ చేపడితే.. ఈపాటికే ప్రజలకు ప్రాణహిత నీరు అందేదన్నారు కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 148 మీటర్ల ఎత్తుతో బ్యారజ్ నిర్మాణం చేపడితే.. రూ. 2 వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తయ్యేదని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద ఎంత ప్రవాహం ఉందో తుమ్మిడిహట్టి వద్ద కూడా అంతే ప్రవాహం ఉందని.. అదనంగా ఒక్క క్యూసెక్ కూడా లేదన్నారు. ఎల్లంపల్లి బ్యారేజ్ ఇప్పటికే పూర్తయ్యిందని.. కాలువలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు జీవన్ రెడ్డి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ పూర్తయితే.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వినియోగంలోకి వచ్చేదని పేర్కొన్నారు. అదే జరిగితే రూ. 38 వేల కోట్లతో 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేదని తెలిపారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం కేవలం 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం అదనంగా రూ. 45 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు నీటిని తరలించే సర్వే ఏమైందని ప్రశ్నించారు. మెడిగడ్డ, అన్నారం లిఫ్ట్‌ల భారం ప్రజలపై పడుతుందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
విడగొట్టి.. వదిలేశారు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టు పడకేసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రాణహిత, కాళేశ్వరం ఎత్తిపోతలుగా విభజించాక.. ప్రాణ హితను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద మూడున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయలేదు. భూ సేకరణ, అటవీ అను మతులపై అసలు పట్టింపే లేకపోవడంతో ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోతోంది. రూ.6,465 కోట్ల ప్రాజెక్టు ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణయించగా, మరో 1.44 లక్షల ఎకరాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కొత్త ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూ.965 కోట్లు అవసరమవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ తర్వాత దాన్ని రూ.1,918.7 కోట్లకు సవరించారు. 70 కిలోమీటర్ల ప్రధాన, నెట్వర్క్ కాల్వలకు నీటి పంపిణీకి కలిపి మొత్తంగా రూ.6,465 కోట్లు అవసరమవుతుందని తేల్చారు. ఈ అంచనాలు పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా అటవీ అనుమతులు, భూ సేకరణ కారణంగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక్క ఎకరా కూడా.. తమ్మిడిహెట్టి బ్యారేజీకి 965 ఎకరాల భూ సేకరణ అవసరం ఉండగా ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా సేకరించలేదు. ఇందులో మహారాష్ట్ర పరిధిలోనూ 60 ఎకరాలు ఉండగా ఆ ప్రక్రియ కూడా ముందుకెళ్లలేదు. ప్రాజెక్టులో పూర్తి నిర్మాణాలకు 8,709.5 ఎకరాలు అవసరమని అంచ నా వేశారు. ఇందులో రిజర్వ్ అటవీ భూమిలోని 508 హెక్టార్ల బదిలీకి కేంద్రం అంగీకరించింది. కానీ పరిహారం చెల్లించక రెండోదశ ప్రక్రియ మొదలవలేదు. తమ్మిడిహెట్టి బ్యారేజీ 2.15 కిలోమీటర్ల నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలో.. కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలో ఉంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా భూమి ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతించడంతో పర్యావరణ, అటవీ అనుమతులు దక్కాయి. కానీ పరిహారం చెల్లింపులో అటవీ శాఖ జాప్యంతో అడుగు ముందుకు పడలేదు. మరో 1,155 ఎకరాలు (622 హెక్టార్లు) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది. ‘గ్రావిటీ’సర్వే గాల్లోనే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీకి తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు చేపట్టిన సర్వే పనులపై వ్యాప్కోస్ దాగుడుమూతలు ఆడుతోంది. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం చెప్పింది. ఈ నేపథ్యంలో తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20–30 టీఎంసీల లభ్యత పెరుగుతుందని, మొత్తంగా 70 టీఎంసీలను గ్రావిటీతో 72వ కిలోమీటర్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి కాలువ ద్వారా సుందిళ్లలో కలపాలని సర్కారు ప్రతిపాదించింది. ఆ సర్వే బాధ్యతలను 2016 మార్చి 18వ తేదీన వ్యాప్కోస్‌కు అప్పగించి రూ.6.67 కోట్లు కేటాయించింది. అయితే హెలికాప్టర్లో లోపాలు, జూన్ వర్షాలతో సర్వేకు బ్రేక్ పడింది. తర్వాత కాళేశ్వరంలోని మల్లన్నసాగర్–సింగూరు, నార్లాపూర్–డిండి అలైన్మెంట్లో బిజీగా ఉండటంతో సుందిళ్ల వైపు వ్యాప్కోస్ కన్నెత్తి చూడలేదు. మరోవైపు సర్వే నిధులు సవరించి 9.35 కోట్ల రూపాయలు కేటాయించాలని వ్యాప్కోస్ కోరడం గమనార్హం. -
‘తమ్మిడిహెట్టి’పై ఒత్తిళ్లకు తలొగ్గిన కేసీఆర్
* విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వేదిక ఆరోపణ * 152 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మించాలి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రధాన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చడంలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ఒత్తిళ్లకు తలొగ్గారని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జల సాధన సమితి నేత నైనాల గోవర్దన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని చంద్రకుమార్ విమర్శించారు. వ్యాప్కోస్ నివేదిక మేరకే గతంలో తమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందనే అంచనాతో ప్రధాన ప్రాజెక్టును ప్రతిపాదించారన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలిక్ సంస్థ నుంచి నివేదిక తీసుకోకుండా మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి తమ్మిడిహెట్టి నుంచి కాల్వలు తవ్వారని.. ప్రాజెక్టు స్థలం మార్పుతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారని చంద్రకుమార్ ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించేలా మహారాష్ట్ర, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని తీసుకె ళ్లాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు ఎందుకు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వం ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మారుస్తోందని నైనాల గోవర్దన్ ప్రశ్నించారు. కమీషన్ల కోసం రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వ పెద్దలు నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించారు. రీ డిజైనింగ్ వల్ల తెలంగాణలో 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందన్నారు. గతంలో తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి.. నీళ్లు లేవనే సాకుతో మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముకు సీఎం కేసీఆర్ కేవలం కస్టోడియన్ మాత్రమేనని.. ప్రజా ధనాన్ని వృథా చేయడాన్ని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపే అవకాశం వున్నా.. అబద్దాల పునాదులపై ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పరిధి నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును తొలగించి.. పాలమూరు ఎత్తిపోతల పథకంలో చేర్చడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చాడ ఆరోపించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ ఎంల్ న్యూ డెమొక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, ఆప్ నాయకులు శ్రీశైలం. రాం నర్సయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'సీఎంకి నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం'
హైదరాబాద్ : తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించడం లేదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ వ్యయం కూడా అదనంగా రూ. 45 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే అంశంపై మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన చీకటి ఒప్పందాన్ని ప్రజలకు చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు... మహారాష్ట్రకు మేలు చేసేలా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. -
'తెలంగాణ... సామంతరాజులా వ్యవహరించింది'
హైదరాబాద్ : గోదావరి నదిపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి స్పందించారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు152 మీటర్ల అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి లాభం కలిగి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గడం వల్ల రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు మాత్రమే మేలు జరుగుతుందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం చక్రవర్తిలా వ్యవహరిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామంతరాజులా వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ను వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించి... మెదక్ వరకే పరిమితం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ వల్ల కూడా రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి న్యాయం జరగిందన్నారు. ప్రాణిహిత - చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం చేపడితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి చెప్పారు. -
తుమ్మిడిహెట్టితో 2 లక్షల ఎకరాలకు నీరు
ఆదిలాబాద్ జిల్లాకు ప్రయోజనం చేకూరేలా వ్యాప్కోస్ నివేదిక హైదరాబాద్: ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా తుది ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తంగా 14.4 టీఎంసీల ప్రాణ హిత నీటిని తుమ్మిడిహెట్టి నుంచి నిర్ణీత ఆయకట్టుకు అందించేలా సర్వే సంస్థ వ్యాప్కోస్ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. వాస్తవానికి ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించదలిచిన బ్యారేజీలో ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. గోదావరి నుంచి 90 రోజుల్లో 160 టీఎంసీలు తీసుకోవాలంటే ప్రతిరోజూ 1.8 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే ఈ స్థాయిలో నీటి లభ్యత తుమ్మిడిహెట్టి వద్ద లేదని వ్యాప్కోస్ తేల్చడం, అదీగాక బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకారం తెలపని నేపథ్యంలో ఈ ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో ప్రాణహిత నీటిని ఆదిలాబాద్ జిల్లా వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వ్యాప్కోస్‌తో సర్వే చేయించింది. -
తుమ్మిడిహెట్టికి ఓకే!
* 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీకి మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం * ముంపుపై అధ్యయనం చేశాక మేడిగడ్డపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి * మహారాష్ట్ర మంత్రితో హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం సమావేశం * 29, 30వ తేదీల్లో రాష్ట్ర అధికారులతో మరోమారు హైదరాబాద్‌లో భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీని ముంపు ఉండని స్థాయిలో నిర్మించేందుకు మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ముంపు లేనందున.. ఆ ఎత్తు తమకు సమ్మతేమనని పేర్కొంది. కాళేశ్వరం దిగువన నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ముంపుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే నిర్ణయం చెబుతామని చెప్పింది. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రాణహిత అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నాగ్‌పూర్‌లో సమావేశం.. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలతో ముంపు విషయమై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆ రాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, విజయ్ శివతరే, జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో... మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపింది. తొలుత గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రూపొందిస్తున్న పథకాలను హరీశ్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో నీటి పంపకాలే ప్రధాన ప్రాతిపదికగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. నీటి వనరుల అభివృద్ధి విషయంలో ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. అందుకు తగినట్లుగా రాబోయే ఐదేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధితో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించి ఆ ప్రకారంగా కాలువల తవ్వకాన్ని కూడా ప్రారంభించిందన్నారు. దానిపై మహారాష్ట్ర అభ్యంతరాలతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం వ్యక్తం చేసిన అనుమానాలను దృష్టిలో పెట్టుకుని... తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అన్వేషించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించిందని మంత్రి చెప్పారు. ఈ ఎత్తులో ముంపు మొత్తం నది గర్భంలోనే ఉంటుందని వ్యాప్కోస్ అధ్యయనంలో తేలిందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు పరిమితం చేసి, మిగతా జిల్లాల అవసరాలకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేలా పథకాన్ని రూపొందించిందని వివరిస్తూ... ఈ రెండు బ్యారేజీలకు అనుమతివ్వాలని కోరారు. అధ్యయనం చేశాక నిర్ణయం తెలంగాణ వాదనలు విన్న మహారాష్ట్ర బృందం తుమ్మిడిహెట్టిపై సానుకూలత తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్ణయాన్ని చెప్పలేదు. మేడిగడ్డ వద్ద సర్వేలో తేలిన ముంపు వివరాలను తాము ధ్రువీకరించుకోవాల్సి ఉందని.. వారంలో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ప్రాణహిత బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. పెన్‌గంగ బ్యారేజీ నిర్మాణంపైనా బోర్డు సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుందామని పేర్కొంది. -
ముంపు ముచ్చటే లేదు!
♦ మా ప్రాంతంలో ఒక్క అడుగు మునిగినా ఒప్పుకోం ♦ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తేల్చిచెప్పిన మహారాష్ట్ర ♦ 148 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ ♦ 152 మీటర్ల ఎత్తు పెంపునకు అంగీకరించాలని కోరిన తెలంగాణ ♦ అసంపూర్తిగా ముగిసిన రెండు రాష్ట్రాల అధికారుల చర్చలు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంచేందుకు అంగీకరించేది లేదని మహారాష్ట్ర మరోసారి స్పష్టం చేసింది. బ్యారేజీతో తమ ప్రాంతంలో ఒక్క అడుగు మేర ముంపు ఉన్నా సమ్మతించ బోమని పేర్కొంది. తాము మొదట్నుంచీ చెబుతున్న 148 మీటర్ల ఎత్తుకే కట్టుబడి ఉన్నామని తెలిపింది. తెలంగాణ కోరుతున్నట్టుగా 152 మీటర్ల ఎత్తు పెంపునకు ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టంచేసింది. దీంతో సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్రం రూపకల్పన చేసింది. అయితే మహారాష్ట్ర మాత్రం ఎత్తు 148 మీటర్లకు మించొద్దని అంటోంది. దీంతో చేసేది లేక తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ ప్రాంతం నుంచి నీటిని తీసుకునే ందుకు తెలంగాణ సిద్ధమైంది. అయితే తుమ్మిడిహెట్టి ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్థ్యం ఎంత అన్నదానిపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాగ్‌పూర్ చీఫ్ ఇంజనీర్ ఆర్ఎం చవాన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ భోగడేలతో కూడిన బృందంతో ఇక్కడి జలసౌధలో చర్చలు జరిగాయి. చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఈఎన్సీ మురళీధర్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరిరామ్, సీడీఓ సీఈ నరేందర్‌రెడ్డి, హైడ్రాలజీ సీఈ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. రాజకీయ పరిష్కారం కనుగొంటాం బ్యారేజీని ఏ ఎత్తులో నిర్మిస్తే ఎంత ముప్పు ఉంటుందన్న అంశంపై సర్వే చేసి ఒక అంచనాకు రావాలని తెలంగాణ అధికారులు మహారాష్ట్ర అధికారులకు సూచించారు. నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే తాము రాజకీయంగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. చర్చల అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘‘148 మీటర్ల ఎత్తుకు మించి మహారాష్ట్ర ఒప్పుకునేలా లేదు. సర్వేలో 148 మీటర్ల ఎత్తులోనూ కొంత ముంపు ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్లో మహారాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయంగా చర్చలు జరిపి ఎత్తుపై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు. మా నిర్ణయం ఇంతే మహారాష్ట్ర అధికారులు బ్యారేజీ ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ 148 మీటర్లకు మించి అనుమతించలేమని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. తమ రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు ముంపును వ్యతిరేకిస్తున్నాయని స్పష్టంచేశారు. బ్యారేజీ ఎత్తు 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచితే ఎంత మేర ముంపు ఉంటుందన్న అంశంపై తామింకా సర్వే చేయలేదన్నారు. ఒకవేళ 48 మీటర్ల ఎత్తులోనూ ముంపు ఉన్నట్టు తేలితే అందుకు కూడా అంగీకరించబోమని తేల్చిచెప్పారు. 152 నుంచి 148 మీటర్ల ఎత్తులో ముంపు ఎంత మేర ఉంటుందో పది రోజుల్లో నిర్ధారించి తమ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. దీనిపై రాజకీయంగానే తేల్చుకోవాలని సూచించారు. -
తుమ్మిడిహెట్టి ఎత్తుపై నేడు మహారాష్ట్రతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో తెలంగాణ అధికారులు సోమవారం మరోమారు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో మహారాష్ట్ర వెల్లడించే అభిప్రాయాల మేరకు బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయానికి రానున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తుపై చర్చలకు రావాలని కోరుతూ ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంత చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చవాన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన మహారాష్ట్ర అధికారులు సోమవారం రాష్ట్రానికి వస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల మేర ఉంటే తమ భూభాగంలో 1,850 ఎకరాల వరకు ముంపు ఉన్న దృష్ట్యా దాన్ని తగ్గించాలని మహారాష్ట్ర కోరుతోంది. ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని అంటోంది. దీంతో చేసేది లేక రాష్ట్రం తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా నిర్ణీత నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచి తీసుకునే అంశమై పరిశీలనలు జరుపుతోంది. అయితే ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాల నిమిత్తం తుమ్మిడిహెట్టి బ్యారేజీని తక్కువ ఎత్తులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ఎత్తు ఎంత, బ్యారేజీ సామర్ధ్యం ఏమాత్రం అన్నదానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభిప్రాయాలను అధికారికంగా తెలుసుకున్నాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. నెలాఖరుతో మూసుకోనున్న బాబ్లీ గేట్లు.. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల 29 నుంచి మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గేట్లు తెరిచి ఉంచేందుకు విధించిన గడువు ఈ నెల 28తో ముగియనున్న నేపథ్యంలో మరుసటి రోజు గేట్లు మూసి నీటిని నిల్వ చేసుకునేందుకు మహారాష్ట్ర సమాయత్తం అవుతోంది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో 7లక్షల ఎకరాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలరాకను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు మహారాష్ట్ర జూలై ఒకటిన ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీరు దిగువకు వచ్చే ఏర్పాట్లు చేసింది. అయితే గోదావరి బేసిన్లో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరాంసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు రాలేదు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో గేట్ల మూసివేతపైనా చర్చించే అవకాశాలున్నాయి. -
మేడిగడ్డ.. మేడి పండేనా?
* కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారమంటున్న నిపుణులు * ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు ఖర్చు రూ. 14 వేల కోట్లు * విద్యుత్ అవసరాలు 270 మెగావాట్ల నుంచి 540 మెగావాట్లకు పెరగొచ్చు * ప్రత్యామ్నాయ డిజైన్లలో ఖర్చు రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 9 వేల కోట్లే * ప్రభుత్వానికి 2 ప్రత్యామ్నాయాలు సూచించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల సాగు అవసరాలను పరిగణనలోకి తీసుకొని చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకంపై మళ్లీ ప్రతిష్టంభన మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్లుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణపరంగా, ఆర్థికంగా, నిర్వహణపరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చిచెబుతుండటం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వం చెబుతున్న వాదనకు, వాస్తవాలకు మధ్య పెద్ద తేడాలను చూపిస్తూ మేడిగడ్డ ప్రతిపాదన మేడిపండులాంటిదేనని, దానికి ప్రత్యామ్నాయంగా చూపుతున్న రెండు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వంపై పడే భారాన్ని, ఎదురయ్యే అడ్డంకులను అధిగమించవచ్చని చెబుతోంది. ప్రభుత్వ దూరదృష్టి, అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అభాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తోంది. ప్రాజెక్టు అంశం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చూపిన ప్రత్యామ్నాయాలు తెరపైకి రావడంతో వాటిని ప్రభుత్వం ఎంతమేర పరిగణనలోకి తీసుకుంటుందనే అంశం చర్చనీయంగా మారింది. మేడిగడ్డ ప్రతిపాదనకు ఎన్నో అడ్డంకులు తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చి దానిపై సర్వే చేయిస్తుండటం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి 115 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి తరలించేందుకు 80 మీటర్ల లిఫ్టు అవసరం. దీనికి 540 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, పంప్‌హౌజ్‌ల నిర్మాణం, కాల్వల తవ్వకానికి మొత్తంగా రూ. 10 వేల కోట్ల ఖర్చు కానుంది. దీంతోపాటే తుమ్మిడిహెట్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలకు నీరివ్వాలంటే అదనంగా మరో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయాలి. మొత్తంగా ప్రాజెక్టుకు రూ. 14 వేల కోట్లు ఖర్చు కానుంది. అయితే ఈ ప్రతిపాదనలో 500 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేస్తే కాల్వ మహదేవ్పూర్ కోల్ మైన్స్ గుండా వెళ్లడంతోపాటు తాడిచెర్ల మైన్స్‌కు అడ్డంకిగా మారుతుంది. మంథని, కమాన్‌పూర్, రామగుండం మండలాల్లో ఇప్పటికే ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా తరలించిన గ్రామాలకు ఇది ఇబ్బందికరం. మేడిగడ్డ లోయర్ గోదావరి బేసిన్లో జీ-10లో ఉన్న కారణంగా నీటి వినియోగంపై తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అంతరాష్ట్ర ఒప్పందాలు తప్పనిసరి అవుతాయి. మొదటి ప్రతిపాదన..: మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తీసుకోవడం. 2009లో సీడబ్ల్యూ సీ లెక్కల మేరకు అక్కడ 236.50 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దాంట్లో 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తుమ్మిడిహెట్టి వద్ద 10 మీటర్ల ఎత్తులో లిఫ్టు ఏర్పాటు చేసి నీటిని తరలించవచ్చు. దీనికి 68 మెగావాట్ల విద్యుత్ అవసరం. 85 కిలోమీటర్ల అనంతరం ప్రధాన కెనాల్‌పై 30 మీటర్ల ఎత్తులో లిఫ్టును ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించాలి. దీనికి మరో 202 మెగావాట్ల విద్యుత్ అవసరం. 270 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా దీనికి రూ. 500 కోట్లు ఖర్చవుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఇతర పనుల ఖర్చు రూ. 6,500 కోట్లు కానుండగా మొత్తంగా రూ.7 వేల కోట్ల మేర ఖర్చవుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనతో అయ్యే వ్యయంతో పోలిస్తే రూ. 7 వేల కోట్ల భారం తగ్గుతుంది. విద్యుత్ వినియోగం తగ్గడంతో ఏటా రూ. 292 కోట్ల మేర మిగులు సాధ్యవుతుంది. రెండో ప్రతిపాదన..: ప్రభుత్వం చెబుతున్న మేరకు సీడబ్ల్యూసీ 2015లో రాసిన లేఖలో తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యతే తేల్చిందని అంటున్నారు. సీడబ్ల్యూసీ లెక్కల మేరకు 75 శాతం డిపెండబులిటీ లెక్కన 120 టీఎంసీల నీటిని అక్కడి నుంచి తీసుకొని వేమనిపల్లి మండలం, వెంచెపల్లి గ్రామం వద్ద నుంచి మరో 40 టీఎంసీల నీరు తీసుకునేలా రెండో ప్రతిపాదన తయారు చేశారు. ఇలా నీటిని తీసుకోవాలంటే మూడు చోట్ల లిఫ్టుల నిర్మాణానికి 300 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా మొత్తంగా రూ. 9 వేల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనలోని మొత్తం లెక్కతో పోలిస్తే ఈ ప్రతిపాదనతోనూ రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు తగ్గుతుంది. విద్యుత్ అవసరాలు 240 మెగావాట్ల మేర తగ్గుతుండటంతో ఏటా పడే భారం రూ. 260 కోట్ల మేర ప్రభుత్వంపై తగ్గుతుంది. -
2017 చివరికి తుమ్మిడిహెట్టి పూర్తి
అధికారులకు కేసీఆర్ ఆదేశం - తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో - 2 లక్షల ఎకరాలకు సాగునీరు - ప్రాణహిత, ఇంద్రావతి నీటి గరిష్ట వినియోగానికి కార్యాచరణ - నీటి పారుదల శాఖలోని - ఖాళీల భర్తీకి అనుమతి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న ప్రాజెక్టును 2017 చివరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. దానిద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నీటిని గరిష్టంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టితో పాటు పలు ఇతర ప్రాజెక్టులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, గొంగిడి సునీత, ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల దిగువకు నీటి ప్రవాహం తగ్గిందని, భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత, ఇంద్రావతిల నీటిని గరిష్టంగా వినియోగించుకొని తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. నిర్మల్, ముధోల్ ప్రాజెక్టును, పెన్‌గంగ బ్యారేజీని త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా 12 మధ్యతరహా ప్రాజెక్టులున్నాయని, వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బోథ్ నియోజకవర్గం కుట్టి దగ్గర మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. జైకా, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాల కింద చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ 2018లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని కార్యాచరణ ఆరంభించాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనలు నిర్మించేటప్పుడు తప్పక వాటికి అనుబంధంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని... నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి డిజైన్లు రూపొందించాలని చెప్పారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఈఈ, ఏఈ పోస్టులు సుమారు 635 వరకు ఉన్నాయని, ఇందులో టీఎస్పీఎస్సీ తొలి విడతలో సుమారు 500 పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించినట్లుగా తెలిసింది. ఇక సీఈ, ఎస్ఈ, డీఈ స్థాయిల్లో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీచేసే అంశమై చర్చ జరిగినట్లుగా సమాచారం. కాగా పలు ప్రాజెక్టుల కోసం చేయాల్సిన భూసేకరణపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్కే జోషిలు జిల్లాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26లోగా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని.. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల కింద భూసేకరణను వేగిరం చేయాలని, జీవో 123ను వాడుకోవాలని అధికారులకు సూచించారు. -
ఇక ‘ప్రాణహిత’ పరుగు!
పనులను వేగిరం చేయాలని సీఎం ఆదేశం ♦ తుమ్మిడి హెట్టి దిగువ, అన్ని కెనాల్ పనులకు లైన్‌క్లియర్ ♦ ఒకట్రెండు రోజుల్లో పనుల ఆరంభానికి అవకాశం ♦ ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో రూ.9,290 కోట్ల పనులు పూర్తి ♦ లైడార్ సర్వే హెలికాప్టర్‌ను ఢిల్లీలో పరీక్షించిన రక్షణశాఖ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో సమూల మార్పులకు దిగిన కారణంగా ప్రాజెక్టు పరిధిలోని అన్ని పనులను నిలిపివేసిన ప్రభుత్వం..తాజాగా గతంలో చేపట్టిన పనులన్నింటినీ పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ దిగువన ఎల్లంపల్లి వరకు చేపట్టిన పనులతో పాటు, ఆ దిగువ ప్యాకేజీ పనులను సైతం యథావిధిగా తిరిగి ఆరంభింపజేయాలని సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నందున, దీనిపై స్పష్టత వచ్చే వరకు నిర్మాణ పనులను పక్కనపెట్టాలని ఆయన సూచించినట్లుగా సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో ఒకట్రెండు రోజుల్లో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్ల తొలి డిజైన్ మేరకు ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి మిడ్‌మానేరు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వేసిన ప్రణాళికల ప్రకారం రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనుల్లో ఇప్పటికే రూ.9,290.26 కోట్ల పనులు పూర్తయ్యాయి. పనులకు ఓకే.. అయితే తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాల దృష్ట్యా ప్రాణహిత నీటిని అక్కడినుంచి కాకుండా, కాళేశ్వరం దిగువనుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్త డిజైన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక వచ్చేంతవరకు పనులు నిలిపివేయాలని ఏప్రిల్‌లో నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో ఐదు నెలలుగా పనులన్నీ నిలిచిపోయాయి. కాగా, ప్రస్తుతం ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి తుమ్మిడిహెట్టిని కొనసాగిస్తూనే, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.15వేల కోట్ల పనుల్లో రూ.4 వేల కోట్ల కెనాల్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను యాథావిధిగా కొనసాగించాలని ఆదివారం అర్ధరాత్రి వరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని ఏ ఎత్తులో కట్టాలన్న దానిపై మరోదఫా మహారాష్ట్రతో చర్చల అనంతరం నిర్ణయం చేద్దామని, ఆ తర్వాతే పనులు చేద్దామని సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ పనులతో పాటే మిడ్‌మానేరు దిగువన రూ.22,866 కోట్లతో చేపట్టిన పనులను వేగిరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెండు రోజుల్లో లైడార్ హెలికాప్టర్రాక.. ఇక కాళేశ్వరం ప్రాంతంలో చేయదలిచిన లైడార్ సర్వే పనులకు రంగం సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన హెలికాప్టర్‌ను ఆదివారం ఢిల్లీకి తరలించగా, అక్కడ ప్రత్యేక పరికరాలు అమర్చిన అనంతరం రక్షణ శాఖ దాన్ని పరీక్షించింది. దీనికోసం వ్యాప్కోస్ సర్వే సంస్థ రూ.2.50 కోట్లు వెచ్చించనుంది. ఈ హెలికాప్టర్ హైదరాబాద్ చేరుకునేందుకు మరో రెండు రోజులు పడుతుందని, ఆ వెంటనే సర్వే పనులను మొదలుపెడుతుందని అధికారులు చెబుతున్నారు. -
బ్యారేజీ కాదు.. ఆనకట్ట!
తుమ్మిడిహెట్టిపై రాష్ట్ర ప్రభుత్వం యోచన * బ్యారేజీకి రూ.1,800 కోట్ల ఖర్చు.. ఆనకట్టకు రూ.200 కోట్లు * ప్రాణహిత-చేవెళ్లపై అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో స్వల్ప మార్పులు చేయాలని యోచిస్తోంది. బ్యారేజీ కి బదులు ఆనకట్ట నిర్మించే దిశగా ఆలోచనలు చేస్తోంది. వ్యయం తగ్గించడంతోపాటు మహారాష్ట్ర నుంచి ముంపు వివాదం లేకుండా ఉండేందుకే ఆనకట్ట నిర్మాణం వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. 6 టీఎంసీలకు అంత ఖర్చు అక్కర్లేదు.. 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఉంటుందని, అక్కడ్నుంచి నీటిని మళ్లించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని చెబుతోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు కుదించి నీటిని నిల్వ చేయాలని భావించింది. అయితే ఇందుకు సుమారు రూ.1,800 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం ఉంది. కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇంతస్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బ్యారేజీ బదులు ఆనకట్ట కట్టాలని యోచిస్తోంది. 2 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే ఎత్తులో కేవలం రూ.200 కోట్ల ఖర్చుతో దీన్ని చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని... అవసరాన్ని బట్టి 80 నుంచి 120 రోజుల పాటు 15 టీఎంసీల వరకు మళ్లించుకోవచ్చని, దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 1.50 లక్షల ఎకరాలకు నీరందించవచ్చన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణం ఏ ఎత్తులో చేపట్టినా ముంపుపై మహారాష్ట్రకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి బదులు ఆనకట్ట వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఒకట్రెండు టీఎంసీలు ఉంటే దాన్ని ఆనకట్టగా, 2 నుంచి 8 టీఎంసీల వరకు ఉంటే బ్యారేజీగా పరిగణిస్తారు. లైడార్ సర్వేకు ఓకే కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సర్వే చేసేందుకు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు అనుమతినిచ్చాయి. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ప్రాజెక్టుల డిజైన్‌లో మార్పుచేర్పుల్లో భాగంగా మరో రెండు రిజార్వయర్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్, గంధమల రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గంధమల రిజర్వాయర్‌ను 0.5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 0.8 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం, ఎల్లంపల్లి అలైన్మెంట్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లుగా సమాచారం. -
అన్నీ మంచి శకునములే..
‘ప్రాణహిత’కు వీడుతున్న చిక్కులు తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును సమర్థిస్తూ సీడబ్ల్యూపీఆర్ఎస్ తుది నివేదిక ఇప్పటికే సిద్ధమైన అటవీ భూ పరిహార నివేదిక.. త్వరలో కేంద్రానికి తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుదల నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులన్నింటికీ శుభసూచకాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుపై పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా ప్రాణం పోసుకుంటున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలను పక్కనపెట్టి, తెలంగాణ చేసిన నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు రోజుల కిందట కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నివేదిక సమర్పించింది. దీంతో మహారాష్ట్రలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రాజెక్టు నిర్మాణంవల్ల కోల్పోతున్న అటవీ భూమికి పరిహారంగా ప్రత్యామ్నాయ భూముల కేటాయింపునకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే రాష్ట్ర అటవీ శాఖకు చేరాయి. అవి మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రం పరిశీలనకు వెళ్లనున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహితపై నిర్మించదలిచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనపు నీటి నిల్వలకు వెసలుబాటు లభించనుంది. దీనిపై సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చే యనున్నారు. మరోపక్క కేంద్ర జల సంఘం(సీడబ్ల్యుసీ) లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర అధికారులు సోమవారం సంఘం చైర్మన్ ఏపీ పాండ్యాతో భేటీ కానున్నారు. ఎత్తు పెంపునకు ఓకే! ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలో ఉన్న తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించదలిచిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడాన్ని ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసిన సీడబ్ల్యు సీపీఆర్‌ఎస్ సంస్థ సమర్థించింది. 152 మీటర్ల ఎత్తు బ్యారేజీతో మహారాష్ట్రలో ఏ ఒక్క గ్రామం ముంపునకు గురికాదని, కేవలం 1300ల నుంచి 1500ల ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన తుది నివేదికను రెండు రోజుల కిందట ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీ ఎత్తును 150 మీటర్ల వరకు తగ్గించాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను ఆ సంస్థ తోసిపుచ్చింది. ప్రస్తుత నివేదికతో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాజెక్టు కింద అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ వేగిరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముుకు ఆ రాష్ట్ర చట్టాలను అనుసరించే పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. దీనికితోడు ప్రాజెక్టు నిర్మాణంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కోల్పోతున్న సుమారు 7వేల ఎకరాల అటవీ భూమికి సమాన భూమిని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించి అందుకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారికి అందించింది. రాష్ట్ర అటవీ శాఖ తుది పరిశీలన అనంతరం ఒకటి, రెండు రోజుల్లో ఈ నివేదిక కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు వెళ్లనుంది. రెండు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపు ఇదిలా ఉండగా ప్రాణహితపై మెదక్ జిల్లాలో నిర్మించదలిచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల నిల్వ సామర్ధ్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, ఈ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణహిత నదిపై కేవలం ఎల్లంపల్లి(20.17టీఎంసీలు), మిడ్‌మానేరు(25.175టీఎంసీలు) మినహాయిస్తే మధ్యలో నిర్మించదలిచిన మేడారం ఎత్తిపోతల, మోతే, అనంతగిరి, తిప్పారం రిజర్వాయర్లన్నీ తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవే. ఈ దృష్ట్యా తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు, పాములపర్తిని 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సంకల్పించింది. నేడు సీడబ్ల్యుసీ చైర్మన్‌తో అధికారుల భేటీ.. ప్రాజెక్టుపై వస్తున్న పలు అభ్యంతరాలపై చర్చించేందుకు సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు సీడబ్ల్యుసీ చైర్మన్ ఏబీ పాండ్యాతో ఢిల్లీలో మరోమారు భేటీ కానున్నారు. 1941 నుంచి ప్రస్తుతం వరకు గోదావరి నదీ జలాల లభ్యతపై కూడిన గణాంకాలతో అధికారులు పాండ్యాకు వివరణ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.40వేల కోట్లపైనా అధికారులు చైర్మన్ లేవనెత్తే సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు. -
మాది 1949 నుంచీ పట్టా భూమే
* ప్రభుత్వ రికార్డులే ఈ విషయాన్ని చెబుతున్నాయి * హైకోర్టుకు ఎన్ కన్వెన్షన్ యజమానుల నివేదన * నోటీసివ్వకుండా చర్యలు తీసుకోవటం సరికాదు * ఎన్ కన్వెన్షన్ తరఫు న్యాయవాది వాదనలు * ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు అనుమతి లేదు * టీ-సర్కారు తరఫున ఏజీ వాదనలు * నేడు కోర్టు ఉత్తర్వులు.. అప్పటివరకూ యథాతథస్థితే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించిన స్థలం 1949 నుంచీ పట్టా భూమిగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉందని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం కోర్టుకు నివేదించారు. తమ భూమిపై ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు లేవని, చెరువును అనుకుని నిర్మాణం ఉందన్న ఏకైక కారణంతో చెరువును ఆక్రమించుకున్నామని చెప్పడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ భూమిని సర్వే చేయాలని అధికారులు భావిస్తే వారికి సహకరిస్తామని వివరించారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లిమిట్స్)ను నిర్ణయించడం, మార్కింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించామని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కన్వెన్షన్ సెంటర్లోని నిర్మాణాలను మార్కింగ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్కన్వెన్షన్ యజమాని, సినీ నటుడు అక్కినేని నాగార్జున, దాని లీజుదారు ఎన్3 ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిపి, ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, ఈ వ్యాజ్యాలపై మంగళవారం కూడా వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం, న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించగా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని నిర్మాణాల విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఇదే హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని శ్రీరఘురాం కోర్టుకు నివేదించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ ఏరియా కేవలం 18.28 ఎకరాలు మాత్రమేనని హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రభుత్వమే పేర్కొందని ఆయన తెలి పారు. అధికారులు మాత్రం 29.24 ఎకరాలను ఎఫ్టీఎల్ కింద పరిగణిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. నిర్దిష్ట విధి విధానాలను పాటించకుండా ఏకపక్షంగా ఎఫ్టీఎల్ నిర్ణయించడం, మార్కింగ్ చేయడం సరికాదని మరో న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని భవనాలకు మార్కింగ్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. చెరువుల పరిరక్షణ నిమిత్తం చర్యలు తీసుకోవాలంటూ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ కన్వెన్షన్ లోనికి వెళ్లి తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ను పరిశీలించారని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కొండం రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. అధికారులది కేవలం పరిశీలనేనని, అందులో భాగంగానే మార్కింగ్ చేసి ఎఫ్టీఎల్ను అంచనా వేసే ప్రయత్నం చేశారన్నారు. ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తే, విధివిధానాలకు లోబడి, ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాన్యానికి ముందస్తు నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తరువాతనే ముందుకెళతారని, ఆ మేర తాను హామీ ఇస్తున్నానని, దానిని రికార్డ్ చేయాలని ఆయన కోర్టును కోరారు. అసలు ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి లేదని, వాటిని కూల్చివేసే సమయంలో కూడా నోటీసులు జారీ చేస్తామని, చట్ట విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోరని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్లు హైకోర్టుకు రావడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తానని, అప్పటి వరకు యథాతథస్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
ఎన్ కన్వెన్షన్‌పై హైకోర్టు స్టే
* కఠినచర్యలు తీసుకోకుండా నియంత్రించాలని నాగార్జున పిటిషన్ * మరో పిటిషన్ దాఖలు చేసిన లీజుదారు * రెండింటిపై విచారణ నేడు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై యథాతథస్థితిని కొనసాగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్‌చేస్తూ సినీనటుడు అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కన్వెన్షన్‌పై కఠినచర్యలు తీసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని నాగార్జున సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి స్టే మంజూరు చేశారు. ఇదే అభ్యర్థనతో నాగార్జున నుంచి ఎన్ కన్వెన్షన్‌ను లీజ్‌కు తీసుకున్న ఎన్3 ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. న్యాయబద్ధంగానే కొన్నాను... గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్‌లాల్ నుంచి 1982లో కొందరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేయగా, 1992లో వారి నుంచి తాను 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొన్నట్టు నాగార్జున తన పిటిషన్లో వివరించారు. చట్టపరంగా, న్యాయబద్ధంగానే కొన్న ఈ స్థలంలో హుడా అనుమతితో ప్రహరీగోడ నిర్మించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించి జీహెచ్ఎంసీ నుంచి లెసైన్స్ తీసుకున్నట్టు, ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నట్టు నాగార్జున తెలిపారు. భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఆయన వివరించారు. తన బీఆర్ఎస్ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, ఫంక్షన్‌హాల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆ వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ ఫంక్షన్‌హాల్‌ను వివిధకార్యక్రమాలకు పలువురు ఇప్పటికే బుక్ చేసుకున్నారని ఆయన తెలిపారు. బఫర్‌జోన్‌లో లేదు... తన ఫంక్షన్‌హాల్ బఫర్జోన్కి వస్తుందని అధికారులు మార్క్ చేసినట్టు తెలిసిందని, 1992లో తాను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బఫర్‌జోన్‌ను ఎందుకు నిర్ణయించలేదని ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. అంతేకాక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ ప్రక్రియంతా చేస్తున్నారు. ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు. 10 హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే, 30 మీటర్లను బఫర్‌జోన్‌గా గుర్తిస్తారని, రికార్డుల ప్రకారం, హెచ్ఎండీఏ వెబ్సైట్ ప్రకారం తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లలోపే ఉందని, దీంతో తన నిర్మాణాలు బఫర్‌జోన్ వెలుపలే ఉన్నాయన్నారు. అధికారుల తాజా మార్కింగ్‌ల వల్ల వారికి, తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.