'సీఎంకి నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం' | Revanth reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'సీఎంకి నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం'

Published Wed, Mar 16 2016 12:59 PM | Last Updated on Sat, Aug 25 2018 6:58 PM

'సీఎంకి నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం' - Sakshi

'సీఎంకి నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం'

హైదరాబాద్ : తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించడం లేదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని టీటీడీపీ నేత రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు.

ప్రాజెక్ట్ వ్యయం కూడా అదనంగా రూ. 45 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే అంశంపై మహారాష్ట్ర రాజ్భవన్లో జరిగిన చీకటి ఒప్పందాన్ని ప్రజలకు చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని కేసీఆర్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు... మహారాష్ట్రకు మేలు చేసేలా వ్యవహరించారని రేవంత్రెడ్డి ఆరోపించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement