
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల–జగిత్యాల జిల్లాల సరిహద్దులో గోదావరి నదిపై ఉన్న రాయపట్నం పాత వంతెన తేలింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో గత ఆగస్ట్‌లో ఈ వంతెన నీట మునిగింది. తొమ్మిది నెలలపాటు నీటిలోనే మునిగి ఉన్న ఈ వంతెన ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో తేలింది. వంతెనతో పాటు నది ఒడ్డున గల శనేశ్వరాలయం, పుష్కర ఘాట్లు కూడా బయటకు కనిపిస్తున్నాయి. నదిలో ప్రస్తుతం పాత వంతెనకు సమానంగా నీరు నిలిచి ఉంది.
జలసిరితో చెరువులు.. పసిడి పచ్చని పంటలు
ముస్తాబాద్ (సిరిసిల్ల): కాళేశ్వరం గోదావరి జలాల తో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని చెరువులు, కుంటలు జలసిరిని సంతరించుకున్నాయి. ఆ చెరువుల కింద పసిడి పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.
మండు వేసవిలో మద్దికుంట ఊర చెరువు, దానికింద కోతకు వచ్చిన వరి పంట బంగారు వర్ణంలో మెరిసిపోతుండగా.. కోతకు రాని పంట పచ్చదనంతో ఉట్టిపడుతోంది. ఇక ముస్తాబాద్ పెద్ద చెరువు గోదావరి జలాలతో మత్తడి పోస్తూ ప్రకృతి రమణీయతతో అలారారు తోంది. ఈ రెండు దృశ్యాలు ఇక్కడి ప్రకృతి ప్రేమికుల మనసులకు ఆహ్లదాన్ని పంచుతున్నాయి.
ఇక్కడ చదవండి:
హైదరాబాద్‌లో జనాభాకు మించి ఆధార్ కార్డులు.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment