రాయపట్నం వద్ద రాకపోకలకు బ్రేక్
- వంతెనపై బస్సులు, భారీ వాహనాలు నిలిపివేత
- ధర్మారం, పెద్దపల్లి, గోదావరిఖని మీదుగా దారి మళ్లింపు
- కమ్మూనూర్ బ్రిడ్జి మీదుగా ఆదిలాబాద్‌కు రాకపోకలు
- యుద్ధప్రాతిపదికన కొత్త బ్రిడ్జి పనులు
ధర్మపురి : కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానం చేసే రాయపట్నం వంతెనపై మళ్లీ వాహనాల రాకపోకలు స్తంభించాయి. గత వారం రోజులుగా గోదావరినదికి వరదలు రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పది టీఎంసీలు దాటింది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రాయపట్నం వంతెన దాకా చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కడెం ప్రాజెక్టు నుంచి మరో ఎనిమిది వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరినదిలోకి వదిలారు. దీంతో రాయపట్నం వంతెనకు రెండు ఫీట్ల కిందికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పైనుంచి ఇంకా ఇన్‌ఫ్లో వస్తుండటంతో శనివారం ఉదయం వరకు వంతెన మునిగే పరిస్థితులు నెలకొన్నారుు.
వంతెన పిల్లర్లు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భావించిన పోలీస్, రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్తగా శుక్రవారం ఉదయం నుంచి వెంతనపై భారీ వాహనాలతోపాటు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాయపట్నం వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయూరుు. ఆదిలాబాద్ వెళ్లే బస్సులను రాయపట్నం నుంచి ధర్మపురి, సారంగపూర్ మండలం కమ్మునూర్ బ్రిడ్జి మీదుగా మళ్లించారు. భారీ వాహనాలు ధర్మారం నుంచి పెద్దపల్లి, గోదావరిఖని మంచిర్యాల వైపు నుంచి ఆయూ ప్రాంతాలకు వెళ్తున్నారుు.
పాత వంతెనకు అరవై ఏళ్లు..
రాయపట్నం లో లెవల్ వం తెన ఆరవై సంవత్సరాలు పూర్తిచేసుకొంది. 1955 సం వత్సరంలో రూ.34 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మిం చారు. 480 మీటర్ల పొడవు, ఐదున్నర మీటర్ల వెడెల్పు, 5మీటర్ల ఎత్తు, 47 పిల్లర్లతో వెంతన నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జిలో కొన్ని పిల్లర్లు శిథిలావస్థకు చేరడంతో వేసవికాలంలో పలుమార్లు మరమ్మతులు చేపట్టి బ్రిడ్జి కాలాన్ని పెంచుతూ వచ్చారు.
వారం రోజుల్లో కొత్త బ్రిడ్జిపై రాకపోకలు
పాత బ్రిడ్జి ప్రమాదపుటంచులకు చేరడంతో కొత్త బ్రిడ్జి పనులను ముమ్మరం చేశారు. బ్రిడ్జిపై తారు రోడ్డు సింగిల్ లైన్ పనులు పూర్తయ్యాయి. ఇరువైపుల అప్రోచ్రోడ్లపై కంకర పనులు చేపడుతున్నారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను ప్రారంభిస్తామని నేషనల్ హైవే 63 ఈఈ మోహన్ తెలిపారు.