
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు.
220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్‌కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment