రాంచీ జైలులో లాలూతో రాష్ట్రపతి కుమారుడి భేటి!
రాంచీ జైలులో లాలూతో రాష్ట్రపతి కుమారుడి భేటి!
Published Mon, Oct 7 2013 12:05 PM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
పశుగ్రాసం కుంభకోణంలో రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ కలుసుకున్నారు.
1990లో తన ప్రభుత్వ హయాంలో బైబాసా ట్రెజరీ నుంచి 37.7 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 30 తేదిన లాలూకి శిక్షను ఖారారు చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టు వెల్లడించిన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హై కోర్టులో అక్టోబర్ 17 తేదిన అప్పీల్ చేయనున్నారు.
రాంచీలోని బిర్సా ముంబా జైలులో లాలూతో అభిజిత్ ముఖర్జీ భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లాలూతో భేటి తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో అభిజిత్ సమావేశం కానున్నారు.
Advertisement