Abhijit Mukherjee
-
కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీలోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో సోమవారం అభిజిత్ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ. Warmly welcoming Shri @ABHIJIT_LS into the Trinamool family! We are certain that your contribution towards fulfilling @MamataOfficial's vision for a brighter Bengal shall be valued by all. pic.twitter.com/oSQgmfxVCR — All India Trinamool Congress (@AITCofficial) July 5, 2021 అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్‌లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... టీఎంసీలోనూ సాధారణ కార్యకర్తగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. అయితే అభిజిత్ ముఖర్జీ నిర్ణయంపై ఆయన సోదరి షర్మిష్ట స్పందిస్తూ.. విచారకరం అంటూ ట్వీట్ చేశారు. SAD!!! — Sharmistha Mukherjee (@Sharmistha_GK) July 5, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు అభిజిత్ ముఖర్జీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు. -
ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని కుమారుడు అభిజిత్ ముఖర్జీ చెబుతూ ఉంటే, పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ఈ చివరి పుస్తకంలో ఆయన సోనియాగాంధీ పైనా, మన్మోహన్ సింగ్‌పైనా చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెబుతూ తనకు తెలిసిన ఇన్సైడ్ సమాచారాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారి తీయడం చర్చనీ యాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై అభిజిత్ సోదరి శర్మిష్ట తీవ్రంగా ప్రతిస్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. -
మరింత విషమంగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే కొనసాగతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జి ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. (ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు) తండ్రిని గుర్తు చేసుకుంటూ శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా ప్రణబ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరం కాలేదన్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకుంది అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
'కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం'
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం ప్రణబ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్పత్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదాల వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది. ముందుకన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే స్పందిస్తున్నాయి. చికిత్సకు కూడా స్పందిస్తున్నారు. ఆయన త్వరలోనే మన మధ్యకు వస్తారని విశ్వసిస్తున్నా" అని తెలిపారు. (ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్) కాగా మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ప్రణబ్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన కుమారుడు వాటన్నింటినీ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. (కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ) -
వెంటిలేటర్‌పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
మానవత్వం చూపిన రాష్ట్రపతి తనయుడు
బురద్వాన్(పశ్చిమ బెంగాల్): రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ.. మానవీయత చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితురాలిని ఆస్పత్రికి తరలించి ఆదుకున్నారు. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తరలించేందుకు సహాయపడ్డారు. బాధితురాలు సుమితాపాల్ ఆదివారం తన కుమారుడు ఆర్ఘ్యతో కలిసి మోటారు సైకిల్ పై బురద్వాన్ నుంచి గస్కరాలోని ఆలయానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. సుమితాపాల్ కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆర్ఘ్యకు ఏమీ తోచలేదు. అదేదారిలో వెళుతున్న అభిజిత్ విషయం తెలుసుకుని తన కారులో సుమితాపాల్ ను హుటాహుటిన గస్కరా ఆస్పత్రికి తరలించారు. బురద్వాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ తో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. అంతేకాదు వైద్యఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఆర్ఘ్యకు అందజేశారు. తాను ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, సాటి మనిషిగా సాయం చేశానని అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ముర్షిదాబాద్ లోని జంగీపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రమాద బాధితురాలిని స్వయంగా ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయనను పలువురు ప్రశంసించారు. -
రెండేళ్లలో డాక్టర్ రెడ్డీస్ మార్జిన్ గెడైన్స్ 25%
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: ఫార్మా వ్యాపారంలో లాభదాయకత పెంచేందుకు తక్కువ మార్జిన్లున్న ఉత్పత్తులను వదిలించుకొని, వ్యయాలను నియంత్రించేందుకు నిర్మాణాత్మక వ్యూహ రచన చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మార్జిన్ గెడైన్స్ 25 శాతంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో మరిన్ని కొత్త ఔషధ ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత వివిధ ఈక్విటీ రీసెర్చ్ సంస్థలకు చెందిన విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్‌కాల్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు.డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు నోటి ద్వారా తీసుకునే మందుల (ఓరల్ సాలిడ్స్) తయారీ సంస్థగా మార్కెట్లో పేరుంది. అయితే దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా ఇన్జెక్టబుల్స్పై దృష్టి పెట్టామని, ఈ ఏడాది ఫైల్ చేసిన 11 ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్)లలో 50 శాతం ఇంజెక్టబుల్స్, టాపికల్స్, ప్యాచెస్, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయని అభిజిల్ ముఖర్జీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది 60 శాతానికి పెరుగుతుందని, దీని వల్లనే పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలు పెరుగుతున్నాయన్నారు. చర్మ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల తయారీలో పోటీ తక్కువగా ఉండటంతో పాటు లాభదాయకత అధికంగా ఉండటంతో ఆ మార్కెట్‌పై దృష్టి పెట్టామన్నారు. వెనిజులా ప్రధాన మార్కెట్? అమెరికా, రష్యా తర్వాత వెనిజులా దేశం తమకు అత్యంత ప్రధాన మార్కెట్గామారిందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధామార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో సరఫరా చేస్తున్న జనరిక్ ఔషధాల ధరలు గత రెండేళ్లలో అనూహ్యంగా పెరగడంపై దర్యాప్తు కోరుతూ అక్కడి ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివాదాస్పద అంశాలపై సాధికార వివరణలిచ్చామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమెన్ చక్రవర్తి తెలిపారు. -
ప్రణబ్ కుమారుడికి ఎదురుగాలి!
జంగీపూర్: పశ్చిమ బెంగాల్ లోని జంగీపూర్ లోకసభ నియోజకవర్గంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీకి ఎదురుగాలి వీస్తోంది. 'బీడి' టౌన్ పేరున్న ఈ నియోజకవర్గంలో ముస్తిం కమ్యూనిటికి చెందిన ఆరుగురు ప్రత్యర్ధులు అభిజిత్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దాంతో ఏప్రిల్ 24 తేదిన జరిగే ఎన్నికలో బహుముఖ పోటి నెలకొంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వామపక్ష అభ్యర్థి ముజఫర్ హోస్సేన్, తృణమూల్ అభ్యర్థి హజీ నురుల్ ఇస్తాం, బీజేపీ సమ్రాట్ ఘోష్ ల నుంచి గట్టిపోటి ఎదురవుతోంది. 2012లో ప్రణబ్ ముఖర్జీ జంగీపూర్ నియోజకవర్గానికి రాజీనామా సమర్పించిన తర్వాత లెఫ్ట్ పార్టీ అభ్యర్థి హోస్సేన్ చేతిలో 2536 ఓట్ల స్వల్ప తేడాతో అభిజిత్ గెలిచారు. ఎన్నికల బరిలో ముగ్గురున్నా.. నలుగురున్నా గెలుపు తనదేనని అభిజిత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రణబ్ ఇదే స్థానం నుంచి లక్ష 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
జైల్లో లాలూని కలసిన రాష్ట్రపతి కుమారుడు
రాంచీ: రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశానికి రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలు సోమవారం వేదికగా నిలిచింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అదే జైలులో ఖైదీగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో అరగంట పాటు సంభాషించారు. భేటీ ప్రాధాన్యం ఏమిటీ? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఇది పూర్తిగా వ్యక్తిగతం అంటూ అభిజిత్ బదులిచ్చారు. దీనిపై బీజేపీ తగిన విధంగా స్పందించింది. ఆ పార్టీ నేత సిద్ధార్థ్నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సమస్యల విషయంలో లాలూ వెన్నంటి ఉంటామని చెబుతూ ఆయనతో భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. -
రాంచీ జైలులో లాలూతో రాష్ట్రపతి కుమారుడి భేటి!
పశుగ్రాసం కుంభకోణంలో రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ కలుసుకున్నారు. 1990లో తన ప్రభుత్వ హయాంలో బైబాసా ట్రెజరీ నుంచి 37.7 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 30 తేదిన లాలూకి శిక్షను ఖారారు చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టు వెల్లడించిన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హై కోర్టులో అక్టోబర్ 17 తేదిన అప్పీల్ చేయనున్నారు. రాంచీలోని బిర్సా ముంబా జైలులో లాలూతో అభిజిత్ ముఖర్జీ భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లాలూతో భేటి తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో అభిజిత్ సమావేశం కానున్నారు.