
పాప్ గాయకుడు దలేర్ మెహందీ (ఫైల్ ఫోటో)
ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. తన మ్యూజికల్ ట్రూప్ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
దలేర్‌కు వ్యతిరేకంగా 31 కేసులు నమోదు కావటంతో గతంలో పాటియాలా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై విడుదలైన దలేర్ ఇన్నేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా దలేర్ మెహందీని దోషిగా తేల్చిన పాటియాలా కోర్ట్ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విదిస్తూ తీర్పు నిచ్చింది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ పాటియాలా కోర్ట్ కస్టడీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment