కోల్‌కతా:ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. కోర్టు తీర్పుపై సంజయ్‌రాయ్ తల్లి మాలతీరాయ్ స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా తగిన శిక్ష విధించాల్సిందేనన్నారు. తనకు కూడా ముగ్గురు కుమార్తెలున్నారని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని చెప్పారు.మహిళా డాక్టర్ పడిన బాధను,నరకాన్ని అర్థం చేసుకోగలనన్నారు.
ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకుగాను సంజయ్‌కు జీవించే హక్కు లేదన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.చనిపోయిన వైద్యురాలు తనకు కూతురితో సమానమని, కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదన్నారు.ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ తమకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
అతడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తామెప్పుడూ అనుకోలేదన్నారు.అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్‌తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని,ఈ విషయంపై పోలీసులు,సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సంజయ్‌రాయ్ ఎంత శిక్ష విధించబోయేదీ సిల్దా కోర్టు సోమవారం తేల్చనుంది. సంజయ్‌రాయ్‌కి మరణశిక్ష విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
ముప్పైఒక ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్‌హాల్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో శనినవారం సిల్దా కోర్ట తీర్పువెలువరించింది. విచారణలో భాగంగా కోర్టు 100 మందికిపైగా సాక్షులను విచారించింది. ఈ కేసులో అరెస్టయినప్పటి నుంచి సంజయ్‌రాయ్ కుటుంబ సభ్యులెవరు అతడిని కలవడానికి ప్రయత్నించలేదు. అతడి తరపున కేసు వాదించడానికి కూడా న్యాయవాదిని కోర్టే న్యాయ సహాయంలో భాగంగా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment