కృష్ణానదిలో దూకి ముద్దాయి ఆత్మహత్య
Published Thu, May 22 2014 6:24 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
గుంటూరు: పోలీసుల నుంచి తప్పించుకుని కృష్ణానదిలో దూకి ఓ నేరస్థుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ దుర్ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
ఓ కేసులో విచారణ నిమిత్తం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ నుంచి ముద్దాయిని విజయవాడకు తీసుకువెళ్లారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ముద్దాయి పరారైనట్టు సమాచారం.
అయితే ముద్దాయిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులకు చిక్కకుండా ముద్దాయి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
Advertisement
Advertisement