న్యూఢిల్లీ: ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీల వీడియోలకు బానిసై మృగంలా మారి 30 మంది చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఓ కిరాతకుడ్ని దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. మరో రెండు వారల్లో ఇతనికి శిక్షను ఖరారు చేయనుంది. అభశుభం తెలియని చిన్నారులను లక్ష‍్యంగా చేసుకుని వరుస అత్యాచారాలకు పాల్పడిన ఈ కామాంధుడి పేరు రవీందర్ కుమార్. వయసు 32 ఏళ్లు. 2008 నుంచి 2015 మధ్య మొత్తం 30 మంది పిల్లలను లక్ష‍్యంగా చేసుకుని వారిపై అత్యాచారాలు చేసి హతమార్చాడు. 2015లో ఇతడు అరెస్టయ్యాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను ఇతను లక్ష‍్యంగా చేసుకునేవాడు. వారికి డబ్బులు, చాక్లెట్టు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబుతారేమోనని వారిని దారుణంగా హత్య చేసేవాడు.
గుడిసెల్లో నివసించే పేదలు, కార్మికుల పిల్లలను కూడా ఇతడు లక్ష‍్యంగా చేసుకునేవాడు. రాత్రివేళ తల్లిదండ్రులు నింద్రించే సమయంలో పిల్లలను ఎత్తుకెళ్లేవాడు. నూతనంగా నిర్మించే భవనాలు, పాడుబడ్డ భవనాలకు తీసుకెళ్లి కామ వాంఛ తీర్చుకునేవాడు. బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు.
పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను రవీందర్ అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన ప్రదేశాలకు కూడా పోలీసులను తీసుకెళ్లాడు. 2015లో ఇతడ్ని విశ్రాంత ఏసీపీ జగ్‌మీందర్ సింగ్ దహియా అరెస్టు చేశారు. మద్యం తాగినా, డ్రగ్స్ తీసుకున్నా రవీందర్ మృగంలా మారి స్వీయ నియంత్రణ కోల్పోయేవాడని తెలిపారు. చంపిన తర్వాత మృతదేహాలను కూడా వదిలేవాడు కాదని పేర్కొన్నారు.
ఢిల్లీలోలోనే కాదు బదాయూ, హథ్రాస్, అలీగఢ్‌లోనూ రవీందర్ అత్యాచారాలకు పాల్పడ్డాడు. పోలీసుల కంట పడొద్దని కాలినడకన, అడవుల ద్వారానే ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవాడు. ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడ్ని ఒక్క కేసులో మాత్రమే కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం.
చదవండి: నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment