serial rapist
-
సీరియల్ రేపిస్ట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..
న్యూఢిల్లీ: ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీల వీడియోలకు బానిసై మృగంలా మారి 30 మంది చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఓ కిరాతకుడ్ని దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. మరో రెండు వారల్లో ఇతనికి శిక్షను ఖరారు చేయనుంది. అభశుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వరుస అత్యాచారాలకు పాల్పడిన ఈ కామాంధుడి పేరు రవీందర్ కుమార్. వయసు 32 ఏళ్లు. 2008 నుంచి 2015 మధ్య మొత్తం 30 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిపై అత్యాచారాలు చేసి హతమార్చాడు. 2015లో ఇతడు అరెస్టయ్యాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను ఇతను లక్ష్యంగా చేసుకునేవాడు. వారికి డబ్బులు, చాక్లెట్టు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబుతారేమోనని వారిని దారుణంగా హత్య చేసేవాడు. గుడిసెల్లో నివసించే పేదలు, కార్మికుల పిల్లలను కూడా ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రివేళ తల్లిదండ్రులు నింద్రించే సమయంలో పిల్లలను ఎత్తుకెళ్లేవాడు. నూతనంగా నిర్మించే భవనాలు, పాడుబడ్డ భవనాలకు తీసుకెళ్లి కామ వాంఛ తీర్చుకునేవాడు. బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను రవీందర్ అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన ప్రదేశాలకు కూడా పోలీసులను తీసుకెళ్లాడు. 2015లో ఇతడ్ని విశ్రాంత ఏసీపీ జగ్మీందర్ సింగ్ దహియా అరెస్టు చేశారు. మద్యం తాగినా, డ్రగ్స్ తీసుకున్నా రవీందర్ మృగంలా మారి స్వీయ నియంత్రణ కోల్పోయేవాడని తెలిపారు. చంపిన తర్వాత మృతదేహాలను కూడా వదిలేవాడు కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోలోనే కాదు బదాయూ, హథ్రాస్, అలీగఢ్‌లోనూ రవీందర్ అత్యాచారాలకు పాల్పడ్డాడు. పోలీసుల కంట పడొద్దని కాలినడకన, అడవుల ద్వారానే ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవాడు. ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడ్ని ఒక్క కేసులో మాత్రమే కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం. చదవండి: నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం -
41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష
జోహన్నెస్‌బర్గ్: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 40 ఇండ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి (2014-19) మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతో పాటు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతో పాటు 41 మంది మహిళలపైగా అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చదవండి: లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్ భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
సీరియల్ రేపిస్ట్‌గా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాక్షి, చెన్నై : చోరీకేసులో తాము అదుపులోకి తీసుకున్న నిందితుడు సీరియల్ రేపిస్ట్ అని తెలిసి పోలీసులే షాకయ్యారు. వారి విచారణలో మరిన్ని ఆశ్చర్యకర నిజాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. తమ ఇంట్లో చోరీ జరిగిందని, విలువైన వస్తువులతో పాటు కొంత నగదు ఓ దొంగ ఎత్తుకెళ్లాడని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు మదన్ అరివలగన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అరివలగన్ మొబైల్ లోని వీడియోలు చూసిన పోలీసులు కంగుతిన్నారు. దాదాపు 50 మంది వరకు యువతులు, మహిళలపై అత్యాచారం జరుపుతుండగా తీసిన వీడియోలు నిందితుడి స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. దీంతో చోరీ కేసు కాదు, సీరియస్ కేసు అని భావించిన పోలీసులు నిందితుడిని పలు విధాలుగా విచారించారు. తమది క్రిష్ణగిరి జిల్లా మథుర్ గ్రామం అని, క్రిష్ణగిరి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు నిందితుడు తెలిపాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేశానని, 2015లో అక్కడ జాబ్ మానేసి చెన్నైకి వచ్చినట్లు పేర్కొన్నాడు. తొలుత ఉద్యోగం కోసం యత్నించగా ఎవరూ పట్టించుకోలేదని, మెల్లమెల్లగా చోరీలకు అలవాటు పడ్డానని, ఆపై ఒంటరి యువతులు, మహిళలున్న ఇళ్లే లక్ష్యంగా చేరీలకు పాల్పడేవాడినని విచారణలో ఒప్పుకున్నాడు. అదే సమయంలో తన గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటారని, చోరీ చేసిన 50 ఇళ్లల్లో యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడటంతో ఆ కీచకపర్వాన్ని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితుడు మదన్ అరివలగన్ వివరించాడు. ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక్క ఫిర్యాదు అందిందని, పరువు పోతుందని భయపడి బాధితురాళ్లు ఫిర్యాదు చేయడం లేదని పోలీసులు అభిప్రాయపడ్డారు. -
సీరియల్ రేపిస్టును వదిలేస్తే మళ్లీ...
దాదాపు రెండేళ్ల క్రితం జైలు నుంచి విడుదల చేసిన సీరియల్ రేపిస్టును బెంగళూరు పోలీసులు మళ్లీ పట్టుకున్నారు. ఎందుకంటే, అతగాడు మళ్లీ మరో ఇద్దరు మహిళల మీద అత్యాచారాలు చేశాడు! అతడిపేరు శివరామరెడ్డి. 2014లో తొలిసారిగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడిని 2015లో వదిలేశారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని, వాళ్లపై అత్యాచారాలు చేసి దోచుకోవడం అతడి ప్రవృత్తి. బెంగళూరులో ఎక్కువగా ఉండే పేయింగ్ గెస్ట్ ఎకామడేషన్లను అతడు సులభంగా టార్గెట్ చేసుకుంటాడని బెంగళూరు తూర్పు మండల అదనపు పోలీసు కమిషనర్ హేమంత్ నింబాల్కర్ చెప్పారు. తనను ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని హాస్టల్లో ఉండే ఓ మహిళ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత మరో హాస్టల్లో ఉండే మరో మహిళ తనపై కూడా ఇదే తరహాలో అత్యాచారం జరిగిందని, దోపిడీ కూడా జరిగిందని చెప్పారు. తొలి మహిళ నిందితుడి పోలికలు చెప్పారని.. దాంతో తమవద్ద ఉన్న ఫొటోను చూపించగా ఆమె వెంటనే గుర్తించారని నింబాల్కర్ తెలిపారు. 2014 ఆగస్టు నెలలో రెడ్డిని గూండా చట్టం కింద అరెస్టు చేసినా, కేవలం ఏడాది జైలుశిక్ష మాత్రమే పడిందని, దాంతో అతడిని విడుదల చేయగా.. మళ్లీ ఈ నేరాలు చేస్తున్నట్లు తేలడంతో ఇప్పుడు అరెస్టు చేశామని వివరించారు. పోలీసులు అతడిని పట్టుకోడానికి ప్రయత్నించగా, వాళ్లను కూడా కత్తితో గాయపరిచాడు. దాంతో అతడి కాళ్ల మీద కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. నిందితుడు తెలుగు వాడే.. చిత్తూరు జిల్లాకు చెందిన శివరామరెడ్డి గత 15 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడు. అతడికి తెలుగుతో పాటు కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషలు కూడా బాగా వచ్చు. ఇలాంటి సీరియల్ రేపిస్టును అంత సులభంగా ఎలా వదిలేశారని మహిళల హక్కుల సంఘాల వారు పోలీసుల మీద మండిపడుతున్నారు. పోలీసులు దాఖలుచేసిన చార్జిషీటు బలహీనంగా ఉండటం వల్లే అతడికి తక్కువ శిక్ష పడిందంటున్నారు. అతడిమీద ఇప్పటివరకు 16 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. -
షాకింగ్: ఢిల్లీలో సీరియల్ రేపిస్టు అరెస్టు
-
షాకింగ్: ఢిల్లీలో సీరియల్ రేపిస్టు అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో షాకింగ్ విషయం బయటపడింది. ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేయబోయిన 38 ఏళ్ల సునీల్ రస్తోగీ అనే టైలర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. విచారణ సందర్భంగా మరో దారుణమైన సంచలన విషయం బయటపడింది. గత 12 ఏళ్లలో తాను దాదాపు 500 మంది పిల్లలపై అఘాయిత్యం చేసినట్లు రస్తోగీ తెలిపాడు. ఇదే నేరానికి గాను ఇంతకుముందు 2006 సంవత్సరంలో ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడు. ప్రధానంగా ఢిల్లీ, పశ్చిమ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఇంటి నుంచి స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్లే బాలికలను ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు చెప్పారు. కొంతకాలం పాటు తూర్పు ఢిల్లీలో ఓ టైలరింగ్ దుకాణంలో పనిచేశాడు. తరచు అటూ ఇటూ వెళ్తూ ఉండేవాడు. ప్రస్తుతానికి ఆధారాలు దొరికిన ఆరు కేసుల్లో మాత్రం రస్తోగీని బుక్ చేశారు. వాటిలో మూడు ఢిల్లీ, రెండు రుద్రాపూర్ మరొకటి బిలాస్పూర్ జిల్లాలోనివి. 2004 సంవత్సరంలో మయూర్ విహార్ ప్రాంతంలో ఉండేటప్పుడు పొరుగింట్లో ఉండే ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేయబోగా.. చుట్టుపక్కల వాళ్లు చితక్కొట్టి అక్కడినుంచి తరిమేశారు. గత సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన పదేళ్ల బాలిక స్కూలు నుంచి తిరిగొస్తుండగా అత్యాచారానికి గురి కావడంతో ఇతడి పాపం పండింది. ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆమెను అడగ్గా, చివరకు విషయం తెలిసింది. బాలిక చెప్పిన వివరాలను, పోలికలను బట్టి నిందితుడి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో జనవరి 12వ తేదీన న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు బాలికలు అపహరణకు గురయ్యారని ఫిర్యాదు నమోదైంది. కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి రస్తోగీ వాళ్లను తీసుకెళ్లాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లి అక్కడ అత్యాచారం చేయబోగా పిల్లలు అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. అతడిని కోండ్లి గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. తాను 2004 నుంచి ఈ తరహా నేరాలు చేస్తున్నట్లు విచారణలో రస్తోగీ వెల్లడించడంతో అంతా నిర్ఘాంతపోయారు. -
సీరియల్ రేపిస్టుకు జీవిత ఖైదు
ఇంటర్నెట్ డేటింగ్ సైట్లో తాను కలిసిన ఐదుగురు మహిళలపై అత్యాచారం చేసి, మరో ఇద్దరిపై దాడికి పాల్పడిన సీరియల్ రేపిస్టుకు జీవిత ఖైదు పడింది. హాంప్‌షైర్‌లోని లిప్హూక్ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్ (55) రెండు వేర్వేరు రకాల ప్రొఫైల్స్ సృష్టించుకుని, ఐదు ప్రాంతాలకు చెందిన మహిళలను ఆకర్షించి, వారిపై అత్యాచారం చేశాడు. ఆ నేరం రుజువు కావడంతో అతడికి జీవితఖైదు విధించారు. పెరోల్ రావాలన్నా కనీసం 12 సంవత్సరాల ఆరు నెలల పాటు అతడు జైల్లో ఉండాల్సి వస్తుంది. అతడు మహిళల పాలిట రాక్షసుడని, అత్యంత ప్రమాదకారి అని జడ్జి గ్రెగరీ డికిన్సన్ అన్నారు. మ్యాచ్.కామ్ అనే డేటింగ్ సైట్లోనే తన భార్యను కూడా కలిసిన లారెన్స్, ఆమెను పెళ్లాడిన కొన్ని నెలలకే ఈ దాడులు చేశాడు. 2011 జూన్ నుంచి 2014 నవంబర్ వరకు డెర్బీషైర్, లింకన్షైర్, నార్తాంప్టన్‌షైర్, కేంబ్రిడ్జిషైర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. -
మానవ మృగానికి నిలువెత్తు రూపం
న్యూఢిల్లీ: పైశాచికత్వానికి ప్రతిరూపం.. మానవ మృగానికి నిలువెత్తు రూపం రవీందర్ కుమార్. దేశరాజధానిలో వెలుగుచూసిన వరుస హత్యాచారాల కేసులో నిందితుడే ఇతడు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 30 మందిపైగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు రవీందర్ చెప్పాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ విక్రంజిత్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని కాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన రవీందర్ ఢిల్లీలో నివసిస్తూ ఐదేళ్ల కాలంలో ఈ కిరాతకాలకు ఒడిగట్టాడు. ఇంటరాగేషన్ లో భాగంగా ఢిల్లీ శివారు ప్రాంతాలైన నరెలా, బవానా, అలీపూర్ లకు అతడిని పోలీసులు తీసుకెళ్లారు. 24 ఏళ్ల రవీందర్ కుమార్ 2008 నుంచి నేరాలు ప్రారంభించినట్టు సింగ్ తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని బేగంపూర్ లో ఓ బాలుడిని అపహరించి హత్యాయత్నం చేసినందుకు గతేడాది అతడిని అరెస్ట్ చేశారు. అయితే బాలుడు ప్రాణాలతో బయటపడడంతో అతడిని వదిలేశారు. ఆరేళ్ల బాలికను అపహరించి, హత్య చేశారనే ఆరోపణలతో ఈనెల 16న అతడిని అరెస్ట్ చేశారు. అతడు బలితీసుకున్న చిన్నారుల సంఖ్య 40కు చేరొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఢిల్లీలో సీరియల్ రేపిస్టు అరెస్టు
ఇంగ్లండ్‌లో వరుసపెట్టి లైంగిక నేరాలకు పాల్పడి.. ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతున్న సీరియల్ రేపిస్టును ఢిల్లీలో క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు. భారత జాతీయుడైన రామీందర్ సింగ్ (28)పై స్కాట్లండ్‌లో లైంగిక దాడి, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అతడు ఢిల్లీలో ఉన్న విషయం తెలియడంతో అదనపు సీపీ అశోక్ చంద్ బృందం పట్టుకుని అరెస్టుచేసింది. ఇంగ్లండ్‌లో చదువుకోడానికి వెళ్లిన రామీందర్ సింగ్, తర్వాత అక్కడ చెత్తపనులన్నీ చేశాడు. అతడి బాధితుల్లో ఒకరు అతడు ఉండే హాస్టల్లోనే ఉండేవారు. మరొకరు పబ్‌లో కలిశారు. రెండో బాధితురాలిని నిర్మానుష్యంగా ఉన్న పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె తిరగబడేసరికి ఆమె దవడలు విరగ్గొట్టాడు. ఈ నేరాలు చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని చండీగఢ్ వచ్చేసి నకిలీ పేరుతో చలామణి అయ్యాడు. ఇంగ్లండ్ ప్రభుత్వం అతడిపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు సంపాదించింది. -
హెడ్మాస్టారి కొడుకు.. సీరియల్ రేపిస్టు!
ఢిల్లీలో ఎంఎన్సీ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నిందితుడు శివకుమార్ యాదవ్.. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా రాంనగర్ గ్రామంలో ఓ హెడ్మాస్టారి కొడుకు. పండిత పుత్రః పరమ శుంఠ అన్నట్లుగా అతగాడు సీరియల్ రేపిస్టుగా తయారయ్యాడు. అతడి మీద చాలా అత్యాచారయత్నం కేసులున్నాయి. గూండా చట్టం, ఆయుధాల చట్టం కింద కూడా పలుమార్లు బుక్కయ్యాడు. తాగి గొడవలు చేయడం అతడికి ఎప్పుడూ ఉన్న అలవాటే. శివకుమార్ యాదవ్ గురించి ఏమాత్రం కొంచెం విచారించినా.. అతడికి ఉద్యోగం ఇవ్వడం కాదు కదా, కనీసం దూరం నుంచి పలకరించే సాహసం కూడా ఎవరూ చేయరు. రాంనగర్ గ్రామంలో శివకుమార్ వస్తున్నాడంటే చాలు.. అమ్మాయిలను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిందిగా చెబుతారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అమ్మాయిల దుపట్టాలు లాగడం, ఇంకా అవకాశం ఉంటే మరింత దారుణాలకు తెగబడటం అతడికి అలవాటు. ఇతడి ఆగడాలను భరించలేక కొన్నేళ్ల క్రితమే పోలీసులు అతడిని జిల్లా నుంచి బహిష్కరించారు. శివకుమార్ యాదవ్ తండ్రి రామ్‌నాథ్ యాదవ్ (76) స్థానిక మునిసిపల్ హైస్కూల్లో హెడ్మాస్టారిగా చేసి రిటైరయ్యారు. ఆయన చాలా మంచివారని, ఇప్పుడు తన కొడుకు చేస్తున్న దురాగతాలకు చాలా బాధపడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆయన ఎప్పుడో తన కొడుకును ఇంటినుంచి తరిమేశారు. తన కొడుకు చేస్తున్న పనులకు సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నానని, దీనికంటే చనిపోతే బాగుండునని అతడి తల్లి గంగశ్రీ వాపోయారు.