ఇంగ్లండ్లో వరుసపెట్టి లైంగిక నేరాలకు పాల్పడి.. ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతున్న సీరియల్ రేపిస్టును ఢిల్లీలో క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు. భారత జాతీయుడైన రామీందర్ సింగ్ (28)పై స్కాట్లండ్లో లైంగిక దాడి, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అతడు ఢిల్లీలో ఉన్న విషయం తెలియడంతో అదనపు సీపీ అశోక్ చంద్ బృందం పట్టుకుని అరెస్టుచేసింది. ఇంగ్లండ్లో చదువుకోడానికి వెళ్లిన రామీందర్ సింగ్, తర్వాత అక్కడ చెత్తపనులన్నీ చేశాడు.
అతడి బాధితుల్లో ఒకరు అతడు ఉండే హాస్టల్లోనే ఉండేవారు. మరొకరు పబ్లో కలిశారు. రెండో బాధితురాలిని నిర్మానుష్యంగా ఉన్న పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె తిరగబడేసరికి ఆమె దవడలు విరగ్గొట్టాడు. ఈ నేరాలు చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని చండీగఢ్ వచ్చేసి నకిలీ పేరుతో చలామణి అయ్యాడు. ఇంగ్లండ్ ప్రభుత్వం అతడిపై ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు సంపాదించింది.
ఢిల్లీలో సీరియల్ రేపిస్టు అరెస్టు
Published Mon, Apr 6 2015 5:17 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement
Advertisement