ముంబయి : బాలీవుడ్ హీరో నిర్దోషిగా బయటకు రావాలంటూ చేసిన ప్రార్థనలు ఫలించలేదు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ఖాన్ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. సల్మాన్ మోపిన అభియోగాలు రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. 2002లో మద్యం తాగి కారు నడిపిన కేసులో డ్రైవర్ కారు నడిపాడన్న సల్మాన్ లాయర్ల వాదనను జడ్జి తోసిపుచ్చారు.
దీంతో సల్మాన్ నిర్దోషిగా బైటికి రావాలని ప్రార్థనలు చేసిన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. గత రాత్రి నుంచి సల్మాన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తమ అభిమాన హీరోపై ఉన్న నేరారోపణలు రుజువు కావని కలలు గన్న అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారంతా సల్మాన్ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారి ప్రార్థనలు ఫలించలేదు..
Published Wed, May 6 2015 11:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement