
సల్మాన్ ఇంటికి బాలీవుడ్ క్యూ..
ముంబయి: ఇప్పుడు అంతటా ఒకటే ఉత్కంఠ.. మరికొద్ది గంటల్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేరం చేశారా లేదా.. అనే విషయం న్యాయమూర్తి తీర్పుతో స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందు బాలీవుడ్ ప్రముఖ వర్గమంతా సల్మాన్ ఖాన్ ఇంటికి బయలు దేరింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ముంబయిలోని గ్యాలాక్సీ అపార్ట్ మెంట్కు బారుల తీరారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఇంటికి వెళ్లి పరామర్శించి దైర్యం చెప్పారు.
తామంతా అండగా ఉన్నామని, మేలు జరగాలని కోరుకుంటున్నామని సల్మాన్ కు చెప్పారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. వీరిద్దరి మధ్య అంత మంచి అన్యోన్యత కనిపించింది. అలాగే సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ముద్దుల సోదరి అర్పిత, ఆమె భర్త ఆయూష్ శర్మ కూడా వచ్చారు. మరో సోదరి అల్విరా.. ఆమె భర్త అతుల్ అగ్నిహోత్రి, సోదరుడు సోహెయిల్ ఆయన ఇంటికి వచ్చి సల్మాన్ తో ఉన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలసి గత రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.