లక్నో: బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తర్ అన్సారీని దోషిగా తేల్చింది ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు. అతనికి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అన్సారీ సోదరుడు, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీని కూడా న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది.
2005లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు అన్సారీ సోదరులు. వీరిపై అనేక నేరారోపణలు ఉన్నాయి. 2001 ఉస్రి ఛట్టి గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి కూడా ఈ ఏడాది జనవరిలోనే ముఖ్తర్‌పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు ఇతర కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
తీర్పు అనంతరం రాయ్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం యూపీలో మాఫియా, గ్యాంగ్‌స్టర్లు అంతమయ్యారని పేర్కొన్నారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు!
Comments
Please login to add a commentAdd a comment