కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు | Life Imprisonment For Father By Raping His Daughter In SangaReddy | Sakshi
Sakshi News home page

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు

Published Sat, Dec 14 2019 12:57 AM | Last Updated on Sat, Dec 14 2019 12:57 AM

Life Imprisonment For Father By Raping His Daughter In SangaReddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి/ వర్గల్‌: కన్న కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో మొదటి అదనపు జడ్జి పాపిరెడ్డి తీర్పు నిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూర్‌ గ్రామానికి చెందిన భీమగాళ్ల బాబు (40) కూతుర్తెన 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో 2018 అక్టోబర్‌ 12న భర్తపై ముత్తమ్మ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో బాబుకు కోర్టు జీవితఖైదు, జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసిన ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్, ఇతర పోలీసులను సిద్దిపేట సీపీ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement