sangareddy court
-
TS: ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు
జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి గన్నారపు సుదర్శన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం.. కాశీంపూర్కు చెందిన వడ్ల నర్సమ్మ తన కొడుకుతో కలిసి జహీరాబాద్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె బంధువులైన వడ్ల వీరన్న కూతురి పెళ్లి కుదిరింది. బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు వెళ్లి ఆ పెళ్లిని ఆపించారు. జహీరాబాద్లో ఉంటున్న నర్సమ్మ ఉద్దేశ పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయించి తన కూతురి పెళ్లిని ఆపించిందని వీరన్న కక్ష పెంచుకున్నాడు. పింఛన్ డబ్బు కోసమని 2016 మార్చి 25న ఆమె జహీరాబాద్ నుంచి కాశీంపూర్కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఇదే అదనుగా భావించి బంధువులైన వడ్ల ప్రభు(40), వడ్ల ప్రశాంత్(19), వడ్ల వెంకట్(19), వడ్ల సంతోష్(19), వడ్ల రేఖ(28), వడ్ల ప్రభావతి(40), వడ్ల ఈశ్వరమ్మ(42), వడ్ల శ్రీకాంత్(17)తో కలిసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నర్సమ్మ కుమారుడు వడ్ల పాండు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సదానాగరాజు, చిరాగ్పల్లి ఎస్ఐ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేసి కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నిందితులకు పై శిక్ష విధించింది. జరిమాన చెల్లించడంలో విఫలమైతే ఒక సంవత్సరం సాధారణ శిక్షతో పాటు రూ. 500 జరిమాన చెల్లించాలని న్యాయమూర్తి సుదర్శన్ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన చిరాగ్పల్లి, జహీరాబాద్ పోలీసులను ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు. -
కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, సంగారెడ్డి/ వర్గల్: కన్న కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో మొదటి అదనపు జడ్జి పాపిరెడ్డి తీర్పు నిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన భీమగాళ్ల బాబు (40) కూతుర్తెన 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో 2018 అక్టోబర్ 12న భర్తపై ముత్తమ్మ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో బాబుకు కోర్టు జీవితఖైదు, జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసిన ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్, ఇతర పోలీసులను సిద్దిపేట సీపీ అభినందించారు. -
తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి... తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి జగ్గారెడ్డి పార్టీ మారే విషయంలో పునరాలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జగ్గారెడ్డి మంగళవారం కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కలసి సీఎల్పీ కార్యాలయ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా తిరికి కాంగ్రెస్లో చేరుతున్నారా? అన్న ప్రశ్నలను ఖండించలేదు కూడా. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. జగ్గారెడ్డి పునరాగమనంపై మెద క్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సమాచారం అందించారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. -
జగ్గారెడ్డికి కోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి)కి కోర్టులో ఊరట లభించింది. టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి కేసులో సంగారెడ్డి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకుముందు ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సదాశివపేటలో ఒక వ్యక్తిని కొట్టినందుకు, సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినందుకు, సిద్దిపేటలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై సిద్దిపేటలో కూడా ఓ కేసు నమోదైంది.