తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి? | jagga reddy former mla sangareddy present in court | Sakshi
Sakshi News home page

తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి?

Published Wed, Dec 3 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి?

తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి?

సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి... తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి జగ్గారెడ్డి పార్టీ మారే విషయంలో పునరాలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జగ్గారెడ్డి మంగళవారం కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కలసి సీఎల్పీ కార్యాలయ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా తిరికి కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అన్న ప్రశ్నలను ఖండించలేదు కూడా. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. జగ్గారెడ్డి పునరాగమనంపై మెద క్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సమాచారం అందించారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement