Jaya Prakash Reddy
-
Jaya Prakash Reddy: ‘నాన్నను చూస్తే ఆడవాళ్లు భయపడేవాళ్లు’
యామిరా యామి చేస్తన్నావు.. అంటూ రాయలసీమ మాండలికంతో గుర్తింపు తెచ్చుకున్నారు.. చిన్నచిన్న పాత్రల నుంచి ఉత్తమ విలన్, ఉత్తమ కమేడియన్ స్థాయికి చేరుకున్నారు.. స్కూల్ టీచర్‌గా రజతోత్సవం చేసుకున్నారు.. కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల వారితో సంబంధం కలుపుకున్నారు.. గొప్ప స్థాయికి చేరినా, సాధారణమైన జీవితం గడిపిన తన తండ్రి జయప్రకాశ్ రెడ్డి గురించి కుమారుడు విపుల్ చంద్రప్రకాష్ రెడ్డి జ్ఞాపకాలు... తాడిపర్తి సాంబిరెడ్డి, సామ్రాజ్యమ్మ దంపతులకు నాన్న మొదటి సంతానం. నాన్నకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు. నాన్న గుంటూరులో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి, ఇంగ్లీషు, లెక్కల మాస్టారుగా గవర్నమెంట్ స్కూల్లో పాతిక సంవత్సరాలు పనిచేశారు. నాన్నది అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ పేరు భాగ్యలక్ష్మి. నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. అక్క మల్లిక, నేను. చదువు విషయంలో లిబర్టీ ఇచ్చారు. నేను వ్యాపారంలో గుంటూరులో స్థిరపడ్డాను. అక్క బీఎస్సీ చదివింది, వివాహం అయ్యాక విజయవాడలో స్థిరపడింది. ఇప్పుడు అమ్మ నా దగ్గరే ఉంటోంది. ( చదవండి: కన్నడ బ్యూటీ కాజోల్ చుఘ్ గురించి ఈ విషయాలు తెలుసా? ) సరదాగా ఉండేవారు... నేను నాలుగో తరగతి చదువుతున్న రోజుల్లో నాన్న నన్ను ఒకే ఒక్కసారి కొట్టారు. ఒక డాక్యుమెంటరీలో నన్ను కొట్టినట్లు నటిస్తే, నేను ఏడ్చినట్లు నటించే సీన్లో నవ్వాను. దాంతో నన్ను నాన్న గట్టిగా కొట్టారు. అప్పుడు ఏడిచాను. అంతే. మళ్లీ ఎన్నడూ చెయ్యి చేసుకోలేదు. మాతో క్యారమ్ బోర్డు, పేకాట వంటివి సరదాగా ఆడేవారు. నా డిగ్రీ పూర్తయ్యాక నేను ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన కొంత కాలానికి నన్ను చూడటానికి అమెరికా వచ్చినప్పుడు నా కారులో యూనివర్సల్ స్టూడియోకు తీసుకెళ్ళాను. ఎంతో సంబరపడ్డారు. మా తాతగారిని తన కారులో తిప్పాలనుకున్న కోరిక నెరవేరనందుకు బాధపడేవారు. నాన్న కోరిక మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి, వ్యాపారం ప్రారంభించాను. లాంగ్ లీవ్... నాన్న మా వూళ్లో షూటింగ్ చూడటానికి వెళ్లినప్పుడు ‘వారాలబ్బాయి’ చిత్రంలో, ఆ తరవాత కంచు కవచం, ఎర్ర మట్టి వంటి చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. మధ్యమధ్యలో సినిమాల కోసం లాంగ్ లీవ్ పెట్టేవారు. నాన్న నటించిన నాటకం చూసిన దాసరిగారు, నాన్నను రామానాయుడు గారికి పరిచయం చేయటంతో, బ్రహ్మపుత్రుడులో పోలీసు వేషం వచ్చింది. ఆ వేషంతో సినిమా అవకాశాలు పెరిగాయి. నాన్న మకాం చెన్నైకి మార్చారు. అయితే.. అది మూణ్నాళ్ల ముచ్చట కావటంతో, తిరిగి గుంటూరు వచ్చేసి, ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం, ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ( చదవండి: చిరుకు మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారో తెలుసా? ) దాసరిగారు నిర్మించిన ‘ఒసేయ్ రాములమ్మా!’తో మళ్లీ సినిమాలలోకి ప్రవేశించారు. ఇక వెనక్కి చూసుకోలేదు. చిన్నతనం నుంచి రాయలసీమ మాండలికం బాగా అలవాటు కావటం సినిమాలలో స్థిరపడటానికి ఉపయోగపడింది. అయినప్పటికీ మళ్లీ అక్కడి పల్లెటూళ్లకు వెళ్లి, సరిగ్గా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. సినిమాలలోకి ప్రవేశించడానికి నాన్న పడిన కష్టాలు, అప్పులు నాకు తెలుసు. ‘కాలక్షేపానికి సినిమాలలో నటించినా పరవాలేదు. అన్నం పెట్టే ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. సొంతంగానే.. నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాన్న సినిమాలలో బిజీగా ఉన్నారు. నేను మూడు నెలలు సెలవు పెట్టి, గుంటూరు వస్తే, నాన్నను కలవడానికి కుదరలేదు. అందుకని హైదరాబాద్ హోటల్లో దిగి, నాన్న షూటింగ్‌కి వెళ్లిన సమయంలో నా పనులు పూర్తి చేసుకుని, సాయంత్రం హోటల్‌కి చేరుకుని, నాన్నతో గడిపాను. వస్త్రధారణ విషయంలో ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. రెండుమూడు రకాలవి నాలుగైదు జతలు కూడా ఉండేవి కావు. గుంటూరు విజయవాడల మధ్య సొంతంగా డ్రైవ్ చేసేవారు. 70 సంవత్సరాలు వచ్చాక డ్రైవర్ని పెట్టుకుని కారులోనే ప్రయాణించారు. అంతకుముందు రైలులోనే ప్రయాణించారు. రాయలసీమ పర్యటన.. సమరసింహారెడ్డి వంద రోజుల వేడుక సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో తిరగాలని యూనిట్ సభ్యులు అనుకుంటే, నాన్నగారు మాత్రం ఈ సినిమా రాయలసీమకు సంబంధించినది కనుక ఆ ప్రాంతాలలో పర్యటిద్దాం అన్నారు. ఒక వీడియో కెమెరా తీసుకుని, నాన్న వెంట నేను కూడా రైలులో బయలుదేరాను. నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ ప్రాంతాలలో థియేటర్లలో మూడు రోజుల పాటు తిరిగాం. ఆ ప్రాంతీయ భాష కావటం వల్ల, అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నాన్నకు రాయలసీమలో ప్రాంతాలు చూపించాలనే అక్కడకు తీసుకువెళ్తే, అక్కడి వారు నాన్న మీద అభిమానంతో స్వయంగా దగ్గరుండి చూపించారు. అక్కడి స్నేహితులు నాపెళ్లికి కూడా వచ్చారు. నో అంటే నో నాన్న చాలా మితంగా భోజనం చేస్తారు. ఉదయం అల్పాహారంలో రెండు దోసెలు, మధ్యాహ్నం కొద్దిగా అన్నం, రాత్రి రెండు చపాతీలు. నాన్‌వెజ్ కూడా చాలా తక్కువ తినేవారు. మమ్మల్ని మాత్రం బాగా తిన మనేవారు. ఆయనకు తినిపించటం మీద చాలా శ్రద్ధ. చాలా సింపుల్‌గా ఉండేవారు. సెలబ్రిటీ అనే భావనే ఉండేది కాదు. కూరలు తేవటానికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడకు వెళ్లినప్పుడు తన అనుమతి లేకుండా సెల్ఫీలు తీస్తే కోపంగా, టీచర్లా క్లాసు తీసుకునేవారు. ఎవరైనా అనవసరంగా ఇంగ్లీషులో మాట్లాడితే, ‘తెలుగులో మాట్లాడొచ్చుగా, మా అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చినా, తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, మీకేమైంది’ అనేవారు. విలన్ వేషాలు వేసే రోజుల్లో ఆడవాళ్లు నాన్న దగ్గరకు రావడానికి భయపడేవారని నాన్న చెప్పారు. నాన్న మరణం మాకు తీరని లోటుగానే ఉంది నేటికీ. సంభాషణ: వైజయంతి పురాణపండ -
జయప్రకాశ్ మరణం తీరని లోటు: మోదీ
టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రకాశ్ రెడ్డి మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన ‘జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ట్వీట్ చేశారు. (నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత) జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. — Narendra Modi (@narendramodi) September 8, 2020 అదే విధంగా జయప్రకాశ్‌రెడ్డి మరణంపై హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ‘గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు జయప్రకాశ్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి అభిమానులకు నా ప్రగాఢ సంతాపం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా టాలీవుడ్ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో బాత్రూమ్లో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. -
నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత
-
నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, గుంటూరు : టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు. గుండెపోటుతో బాత్రూమ్లో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొరిటెపాడు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి... రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్‌సింగ్, నాయక్, రేసుగుర్రం, మనం, టెంపర్, సరైనోడు తదితర సినిమాల్లో నటించారు. సీనియర్ కథానాయకులతో పాటు యువ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్) పేరుతో ఇటీవల ఓ సినిమాను కూడా నిర్మించారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయప్రకాశ్‌రెడ్డి మరణం పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్య మం ముసుగులో ఎంపీ బాల్క సుమన్ విద్యార్థులను హత్య చేశారని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్యల వివరాలను బయటపెడతానన్నారు. ‘నాకు గుండు కొట్టిస్తానని సుమన్ అంటున్నడు. దమ్ముంటే నన్ను ముట్టుకో. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులే సంగారెడ్డికి రావాలంటే భయపడతరు’ అని జగ్గారెడ్డి అన్నారు. సుమన్‌కు దమ్ముంటే ఓయూ లో సీఎంతో సభ పెట్టించాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోనూ సుమన్‌ను తిరక్కుండా చేయగలనన్నారు. -
మనది విలన్ టైప్... అందుకే...
ఉత్తమ విలన్ ఇది నా రాజ్యమే...ఇక్కడ పగలేగానీ ప్రేమలుండవు. కక్షలేగానీ కనికరాలుండవు ఒక్కసారి టైమ్‌మిషన్‌లోకి వెళ్లి 1991లో ఆగండి. దగ్గర్లో ఉన్న థియేటర్లో ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూడండి. ఆ సినిమాలో పొట్ట చెక్కలయ్యేలా నటించే నటుల్లో జయప్రకాష్‌రెడ్డి కూడా ఉంటారు. ఆయన ఊత పదం ‘తూ....చ్’ ‘నీ యెంకమ్మ’లాగే బాగా పాప్లర్ అయింది. పె....ద్దగా నవ్వి... ‘మనది విలన్ టైప్. అందుకే అలా నవ్వాను.... తూ....చ్’ అనే డైలాగ్ విసురుతారు. ఇంకాస్త వెనక్కి వెళ్లండి. సరిగ్గా 1988లో ఆగండి. ‘బ్రహ్మపుత్రుడు’ సినిమా మరొక్కసారి చూడండి. జయప్రకాష్ ఎస్పీగా కనిపిస్తారు. ఆయన డైలాగ్ ఒకసారి వినండి... ‘హ్యాండ్సప్... చేతుల్లో ఉన్నది కింద పెట్టు. చేతులు ముందుకు పెట్టు. చెడుగుడు ఆడేస్తా....’ జయప్రకాష్‌రెడ్డి పేరుకి విలన్‌గా కనిపించినా... ఆయన డైలాగ్‌లకు భయం కంటే ముందు నవ్వే వస్తుంది. ఆయన విలనిజంలో కామెడీ అంతర్లీనమై కితకితలు పెడుతుంది. అయితే... ఇదంతా ఒకప్పటి సంగతి. సరిగ్గా చెప్పాలంటే... ‘ప్రేమించుకుందాంరా’ సినిమా ముందు సంగతి. ఈ సినిమా తరువాత... జయప్రకాష్‌రెడ్డిని తెర మీదే కాదు... తెర బయట చూసి కూడా భయపడ్డారు చాలా మంది! జయప్రకాష్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడడం అంటే తెగ పిచ్చి. రొటీన్‌గా అయితే ‘ఇదేమి పిచ్చి? చదువుకోకపోతే ఆడుక్కు తింటావు. నాటకాలు అన్నం పెట్టవు’ అనే డైలాగు కోపంగా వినిపించాలి. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎలాంటి డైలాగ్ వినిపించలేదు. జయప్రకాష్‌రెడ్డి నాన్నగారు పోలీసు అధికారి. నటుడు కూడా. ఆయనలోని నటుడు కొడుకులోని నటుడిని ఎక్కడా నిరాశ పరచలేదు. కొడుకుతో కలిసి స్వయంగా నాటకాలు వేశాడు ఆ తండ్రి! నాటకాలు వేసినంత మాత్రాన చదువును నిర్లక్ష్యం చేయలేదు జయప్రకాష్. చదువులోనూ ముందుండేవాడు. డిగ్రీ... ఆ తరువాత టీచర్ ట్రైనింగ్... ఆ తరువాత లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అంతమాత్రాన... ఆయనలోని నటుడు ఊరుకుంటాడా? పాఠాలు పాఠాలే... నాటకాలు నాటకాలే! ఒకసారి నల్లగొండలో జయప్రకాష్‌రెడ్డి బృందం ‘గప్‌చుప్’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి నారాయణరావుకు జయప్రకాష్ నటన బాగా నచ్చింది. ఇదే విషయాన్ని రామానాయుడుతో చెప్పారు. రామానాయుడు ఈ నాటక బృందాన్ని హైదరాబాద్‌కు పిలిపించుకొని ‘గప్‌చుప్’ చూశారు. ఆయనకు కూడా జయప్రకాష్ రెడ్డి నటన బాగా నచ్చింది. అలా జయప్రకాష్‌కు ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. అయితే జయప్రకాష్‌కు పెద్దగా పేరు రాలేదు. కెరీర్ ఊపందుకోలేదు. అటు చూస్తేనేమో... అప్పులు అంతకంతకు పెరిగి పోతున్నాయి. బాగా ఆలోచించుకున్న తరువాత... బ్యాక్ టు పెవిలియన్ అని డిసైడ్ అయ్యారు. లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికి... వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ సినిమాకు విలన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా? అని కూడా వెదుకుతున్నారు. రామానాయుడు మాత్రం జయప్రకాష్‌రెడ్డి పేరు చాలా గట్టిగా సూచించారు. అప్పటికి జయప్రకాష్ స్టార్ విలన్ కాదు... ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. టైమ్ అంటే ఇదేనేమో! ‘‘పొరపాటున కూడా కామెడీ కనిపించకూడదు. ఔట్ అండ్ ఔట్ సీరియస్‌గా చేయాలి’’ అని చెప్పాడు డెరైక్టర్ జయంత్. సీరియస్‌గా కాదు... ప్రేక్షకులు వణికిపోయేలా విలనిజాన్ని ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు జయప్రకాష్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంత ఎత్తు, భారీ కాయం, పెద్ద మీసాలు... అమ్మో జయప్రకాష్‌రెడ్డి! తూ...చ్ అని తెగ నవ్వించిన జయప్రకాష్‌రెడ్డి ఎంత పెద్ద విలన్‌గా ఎదిగారు... ఎంతలా భయపెట్టారు!! -
తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి... తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి జగ్గారెడ్డి పార్టీ మారే విషయంలో పునరాలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జగ్గారెడ్డి మంగళవారం కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కలసి సీఎల్పీ కార్యాలయ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా తిరికి కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అన్న ప్రశ్నలను ఖండించలేదు కూడా. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. జగ్గారెడ్డి పునరాగమనంపై మెద క్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సమాచారం అందించారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. -
జగ్గారెడ్డి గడ్డం గీసుకోడు..పవన్ గీసుకుంటాడు..
'జనసేన' పార్టీ ఆవిర్భావం రోజున ఆర్భాటంగా ప్రకటించిన లక్ష్యాలకు, విధానాలకు పవన్ కళ్యాణ్ అప్పుడే మంగళం పాడే కార్యక్రమానికి పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 'జింపింగ్ జిలానీ'లకు జనసేన పార్టీలో స్థానం ఉండదని, మద్దతు ప్రకటించేది లేదని ఆర్భాటంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా 'జంపింగ్'కు సిద్దమవుతున్న జగ్గయ్యకు పవన్ మద్దతిచ్చేందుకు పవన్ సుముఖంగానే ఉన్నాడు. పవన్ తీరు చూస్తుంటే జగ్గారెడ్డి గడ్డం గీసుకోడు.. నేను అప్పడప్పుడూ గీసుకంటాను. తన భావాలకు జగ్గారెడ్డి భావాలు చాలా దగ్గరగా ఉంటాయని.. ఆయన నేను సేమ్ టూ సేమ్ అని అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వ్యవహార తీరును చూస్తే హామీలు ఇవ్వడానికి, వేదికల మీద ఉపన్యాసాల రూపంలో దంచడానికి, అభిమానులకు వినేందుకు సొంపుగానే ఉంటాయి. ఓసారి రంగంలోకి దిగాక.. తన లక్ష్యాలను ఆచరణలో పెట్టడమే కష్టమని పవన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్టున్నాడు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు వరకు మోస్తారు నేతగా పేరున్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ కలిసి తన భవిష్యత్ కార్యాచరణకు మార్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బ తిని.. పట్టుమని పది రోజులు కాకముందే ప్లేట్ ఫిరాయించేందుకు దారులు వెతుకుంటున్నాడు. శాశ్వతంగా మూతపడిన టీఆర్ఎస్ గేట్టు తనకోసం తెరుచుకోవు కనుక.. మంచి స్వింగ్ లో బీజేపీ లేదా జనసేనలో దూకేందుకు పవన్ కళ్యాణ్ ఎదురుగా కనిపించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ కూడా జగ్గారెడ్డిని జనసేన వేదికపై మోసేయడంతో పార్టీ మారేందుకు దారి వెతుక్కోవడం సులభమైంది. దాంతో పవన్ ను కలిసి తన మనసులో మాటను బయటపెట్టుకున్నాడు. ఆతర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మిట్ పెట్టి జగ్గారెడ్డి బీజేపీలో చేరితే తాను మద్దతిస్తాను అని ఓ మాట చెప్పేశాడు. ఇదంతా ఎందుకంటే కేసీఆర్ గెలిచిన మెదక్ పార్లమెంట్ సీటు ఉప ఎన్నిక జగ్గారెడ్డి తాత్కాలిక లక్ష్యంగా కనిపించడం. టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి.. ఆతర్వాత కొద్ది రోజులకే కేసీఆర్ తో విభేదించి.. కాంగ్రెస్ లోకి జంప్ చేశాడు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులకు సన్నిహితంగా మెలుగుతూ కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారాడు. తెలంగాణవాదినైనా తాను సమైక్యవాదమే తన ప్రధాన ఎజెండా అని చెప్పుకునే జగ్గయ్యను ఓటర్లు మాజీని చేశారు. ఇక ఇప్పట్లో కాంగ్రెస్ తో పనవ్వడం కష్టమే అనే నిర్ణయానికి వచ్చిన జగ్గారెడ్డి తన 'జంపింగ్' అస్త్రాన్ని ప్రయోగించాడు. జంప్ కొట్టడం జగ్గయ్యకు వెన్నతో పెట్టిన విద్యే..ఆయన తీరును పెద్దగా తప్పు పడితే.. మనం తప్పున పడుతాం. కాని దేశ సమైక్యత, సమగ్రత అనే భారీ పదజాలాన్ని పదే పదే ఉపయోగిస్తూ.. జంపింగ్ లకు తాను దూరమని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆమాట మరిచి.. తాను అందరూ రాజకీయ నాయకుడిల్లో ఒకరినని చెప్పకనే చెప్పాడు. వేదికలపై ఉన్నత ఆశయాలున్నట్టు పొలిటికల్ ట్రిక్కులకు పాల్పడితే.. ప్రజలు ఎప్పుడు గమనిస్తునే ఉంటారని పవన్ తెలుసుకుంటే మంచిదనుకుంటా. -
తొలిప్రేమ కబుర్లు
ప్రేమ గురించి పరులతో చెప్పుకోకూడదు. అలాగే మన ప్రేమ గురించి పరులు చెప్పుకోకూడదు అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. అంబటి గోపి దర్శకుడు. సత్యనారాయణ మంగలిపల్లి, నాగరాజు మంగలిపల్లి నిర్మాతలు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమను రహస్యంగా ఎందుకు ఉంచాలి అనేది ఇందులో ప్రధానాంశం. చక్కని సందేశం ఉంటుంది. అన్ని వయసులవారికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు స్పందన బావుందని నిర్మాతలు తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, కొండవలస, ప్రభాస్‌శ్రీను, అన్నపూర్ణ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటివీర, సంగీతం: జీవన్ థామస్. -
నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!
విలనీ, కామెడీ... ఏదైనా జయప్రకాశ్‌రెడ్డికి సునాయాసమే. పైకి విలన్‌గా కనిపిస్తారు కానీ, చేసే పనులూ సేవాకార్యక్రమాలూ చూస్తే ఎవరైనా సరే జేపీని ఓ హీరోగా చూస్తారు. పాతికమంది పిల్లలకు విద్యాదానం చేస్తున్నారాయన. నటుడిగా తనకు ఓ దారి చూపించిన రంగస్థల వైభవాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ కమర్షియల్ యుగంలో కూడా నిజాయితీ, ఆత్మసంతృప్తి అని మాట్లాడే జేపీతో జరిపిన ప్రత్యేక భేటీ. మీ ఆహార్యం విలన్ పాత్రలకు యాప్ట్ అయినా కామెడీ కూడా చేస్తున్నారు. ఈ రెంటిలో మీకేది ఇష్టం? మొదట్నుంచీ హాస్యం అంటేనే ఇష్టం. అయితే సినిమాల్లో సీరియస్ కేరక్టర్స్‌కే బాగా పేరొచ్చింది. వరుసగా అలాంటి అవకాశాలే వచ్చాయి. తర్వాత తర్వాత నాలో కామెడీ టింజ్ చూసి, దర్శకులు ఆ తరహా పాత్రలు చేయిస్తున్నారు. అంతకు ముందు ఆడవాళ్లు, చిన్నపిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు. కానీ, ఇప్పుడందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మీ డ్రీమ్ కేరెక్టర్? అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంటుంది. నా నటనలో ఎప్పుడూ మూస కనపడదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, గోదావరి, నెల్లూరు... ఇలా ఏ శ్లాంగ్లోనైనా మాట్లాడగలనని నిరూపించుకున్నాను. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకులు ఎలా కావాలంటే అలా చేస్తాను. ఇక, నా డ్రీమ్ రోల్ విషయానికొస్తే... ప్రేక్షకులతో కంట తడిపెట్టించి, హృదయానికి హత్తుకునే పాత్ర ఎప్పటికైనా చేయాలని ఉంది. అసలు ఏ ఆశయంతో నటుడయ్యారు.. దాన్ని నెరవేర్చుకోగలిగారా? ఆశయం అంటూ ఏదీ లేదు. మా నాన్నగారు మంచి రంగస్థల నటుడు. కానీ, పోలీస్ ఉద్యోగం వల్ల నటించలేకపోయారు. అందుకే నాన్నగారు నన్ను రంగస్థల నటుణ్ణి చేయాలనుకున్నారు. నాకూ అదే ఇష్టం. అందుకని కళాకారుడినయ్యాను. అట్నుంచి సినిమాల్లోకొచ్చా. నటుడిగా బిజీ అయ్యాక కూడా నాటకాలు ప్రదర్శిస్తున్నారు కదా? ఆంధ్రదేశంలో ప్రతి ముఖ్య పట్టణంలో ప్రతి ఆదివారం ఒక నాటక ప్రదర్శన జరగాలనేది నా కల. ఎందుకంటే మంచి నటీనటులు ఉన్నారు. నాటకాలను ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఉన్నారు. దాతలు కూడా ఉన్నారు. కానీ, వీటిని కో-ఆర్డినేట్ చేసేవాళ్లు లేరు. నా వంతు ప్రయత్నంగా నేను గుంటూరులో ‘జేపీ నెల నెలా నాటక సంఘం’ పేరుతో ఓ సంస్థ ప్రారంభించాను. ప్రతినెలా రెండో ఆదివారం ఓ చక్కని నాటకం చూపించాలన్నది నా ఆశయం. సినిమాల వల్ల ఆర్థికంగా మీకు లాభం ఉంటుంది.. మరి నాటకాల సంగతేంటి? సినిమాలు చేస్తే నా జేబులోకి డబ్బులొస్తాయి. కానీ నాటకాలు చేస్తే జేబులోంచి డబ్బులు పోతాయి. అయితే, నాటకాలనేది డబ్బు కోసం కాదు. సంతృప్తి కోసం. డబ్బులు కోసం చేసే సినిమాల ద్వారా కూడా నాకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఓ పది, పదిహేనేళ్లు సినిమా రంగంలో నానా కష్టాలు పడిన తర్వాత ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నాకో సీటు లభించింది. ‘సమరసింహారెడ్డి’తో బెర్త్ కూడా కన్ఫార్మ్ అయ్యింది. అక్కణ్నుంచీ చాలా అవకాశాలు వస్తున్నాయి. ఓ నటుడిగా అవకాశాలు రావడమే గొప్ప. అందుకే, సినిమాలు వదులుకోను. టీచర్ వృత్తి నుంచి సినిమాలకు వచ్చారు. ఆ ప్రయాణం గురించి? మా నాన్నగారు సాంబిరెడ్డి నిజాయితీ గల పోలీసాఫీసర్. ఆయన ఆల్ ఇండియా కబడ్డీ చాంపియన్. స్పోర్ట్స్ కోటాలో సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేశారు. డీఎస్పీగా, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. లంచం తీసుకోని వ్యక్తి. మా నాన్నగారితో పాటు చేసినవాళ్లందరూ బాగా సంపాదించుకున్నారు. కానీ, మా తాతగారు సంపాదించినది 90 శాతం అమ్మేశారు నాన్నగారు. అంతటి సిన్సియర్ పోలీసాఫీసర్. మామూలుగా చాలామంది ఇళ్లల్లో నాటకాల్లో నటిస్తే తిడతారు. కానీ, మేం ఎప్పుడైనా పదిరోజులు నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు. నేను, నా ఇద్దరు తమ్ముళ్లు, నా చెల్లెలు.. లంచం తీసుకునే ఉద్యోగాలు చేయకూడదన్నది నాన్నగారి నిర్ణయం. నేను డిగ్రీ పాసవ్వగానే.. కమర్షియల్ టాక్స్, ఇన్కమ్ టాక్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రైల్వేశాఖల్లో నాకు జాబ్ వచ్చింది. కానీ, నాన్నగారు వద్దన్నారు. ఉపాధ్యాయుడిగా చేయమన్నారు. ఆయన కోరిక ప్రకారమే మున్సిపల్ హై స్కూల్లో టీచర్‌గా చేరాను. చాలా మనస్ఫూర్తిగా పని చేశాను. ఆ తర్వాత హెడ్మాస్టర్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా నాన్నగారు ఎప్పుడూ ‘ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్’ అని ఓ స్లోగన్ చెబుతుండేవారు. నేనలానే ఉంటాను. అందుకే ఇప్పటివరకు నాకు బీపీ లేదు. మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఆత్మసంతృప్తి. అందుకే ఆయన్ను నిత్యం స్మరించుకుంటుంటాను.