తొలిప్రేమ కబుర్లు | 'First Love' movie Release on 27th December | Sakshi
Sakshi News home page

తొలిప్రేమ కబుర్లు

Dec 22 2013 11:47 PM | Updated on Jul 25 2019 5:25 PM

తొలిప్రేమ కబుర్లు - Sakshi

తొలిప్రేమ కబుర్లు

ప్రేమ గురించి పరులతో చెప్పుకోకూడదు. అలాగే మన ప్రేమ గురించి పరులు చెప్పుకోకూడదు అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ లవ్’.

ప్రేమ గురించి పరులతో చెప్పుకోకూడదు. అలాగే మన ప్రేమ గురించి పరులు చెప్పుకోకూడదు అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. అంబటి గోపి దర్శకుడు. సత్యనారాయణ మంగలిపల్లి, నాగరాజు మంగలిపల్లి నిర్మాతలు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమను రహస్యంగా ఎందుకు ఉంచాలి అనేది ఇందులో ప్రధానాంశం. చక్కని సందేశం ఉంటుంది. అన్ని వయసులవారికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు స్పందన బావుందని నిర్మాతలు తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, కొండవలస, ప్రభాస్‌శ్రీను, అన్నపూర్ణ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటివీర, సంగీతం: జీవన్ థామస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement