నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి (ప్రస్తుతం ఇందల్వాయి) మండలం నల్లవెల్లి అటవీప్రాంతంలో ఎఫ్‌ఆర్‌వో గంగయ్య హత్యకేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సోమవారం 14 మందికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 14 మందికి జీవితఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి నూరిలాఘోరి తీర్పు వెలువరించారు. మిగతా 22 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. నిందితుల్లో కరీంనగర్‌కు చెందిన నీరడి సాయన్న కోర్టుకు హాజరుకాలేదు.
మరొకరు అనారోగ్యంతో మృతి చెందడంతో 35 మంది మాత్రమే సోమవారం కోర్టుకు హాజరయ్యారు. మొదట కేసు నమోదు చేసిన పోలీసులు సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములుతో పాటు మరికొందరికి హత్యతో సంబంధం ఉన్నదని గుర్తించి కేసులు నమోదు చేశారు. వీరిని జిల్లా కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపారు. వీరు అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం జీవితఖైదు పడిన వారిలో వీరిపేర్లు లేవు. వీరిని నిర్దోషులుగా పేర్కొన్నారు.
జీవితఖైదు పడిన 14 మంది వీరే..: జీవిత ఖైదు పడిన వారిలో నల్లవెల్లికి చెందిన ఒడ్డె భాస్కర్, ఒడ్డె రాములు, మందుల పెద్ద సాయిలు, సింగజోగి గోపాల్, గొల్ల ముత్త య్య, గాండ్ల లక్ష్మణ్, కటిక మదన్‌లాల్, బండారి వెంకటి, మక్కల చిన్నవెంకటి, ఎల్లయ్య, బండి యాదగిరి, మక్కల లక్ష్మి, పిట్ల రమేష్, గొళ్లెం రాజు ఉన్నారు.
14 మందికి జీవిత ఖైదు
Published Tue, Sep 26 2017 2:40 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Advertisement