Gangaiah murder
-
14 మందికి జీవిత ఖైదు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి (ప్రస్తుతం ఇందల్వాయి) మండలం నల్లవెల్లి అటవీప్రాంతంలో ఎఫ్ఆర్వో గంగయ్య హత్యకేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సోమవారం 14 మందికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 14 మందికి జీవితఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి నూరిలాఘోరి తీర్పు వెలువరించారు. మిగతా 22 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. నిందితుల్లో కరీంనగర్‌కు చెందిన నీరడి సాయన్న కోర్టుకు హాజరుకాలేదు. మరొకరు అనారోగ్యంతో మృతి చెందడంతో 35 మంది మాత్రమే సోమవారం కోర్టుకు హాజరయ్యారు. మొదట కేసు నమోదు చేసిన పోలీసులు సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములుతో పాటు మరికొందరికి హత్యతో సంబంధం ఉన్నదని గుర్తించి కేసులు నమోదు చేశారు. వీరిని జిల్లా కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపారు. వీరు అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం జీవితఖైదు పడిన వారిలో వీరిపేర్లు లేవు. వీరిని నిర్దోషులుగా పేర్కొన్నారు. జీవితఖైదు పడిన 14 మంది వీరే..: జీవిత ఖైదు పడిన వారిలో నల్లవెల్లికి చెందిన ఒడ్డె భాస్కర్, ఒడ్డె రాములు, మందుల పెద్ద సాయిలు, సింగజోగి గోపాల్, గొల్ల ముత్త య్య, గాండ్ల లక్ష్మణ్, కటిక మదన్‌లాల్, బండారి వెంకటి, మక్కల చిన్నవెంకటి, ఎల్లయ్య, బండి యాదగిరి, మక్కల లక్ష్మి, పిట్ల రమేష్, గొళ్లెం రాజు ఉన్నారు. -
భద్రత ఎక్కడ!
ధర్పల్లి: అటవీ అధికారుల భద్రతను ఉన్నతాధికారు లు గాలికి వదిలేశారు. వారి ప్రాణాలకు ముప్పుం దన్న సోయి కూడా సర్కారుకు లేకుండా పోయింది. ధర్పల్లి మండలం నల్లవెల్లి శివారులోని అటవీ ప్రాం తంలో ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ గంగయ్యను అటవీ భూకబ్జాదారులు కిరాతకంగా గొడ్డళ్లతో నరికి హత్యచేసి ఏడాది. గత సెప్టెంబర్ 14న అర్ధరాత్రి దాటిన తర్వాత గంగయ్యను దారుణంగా హత్యచేశారు. ఆయనతోపాటు ఉన్న ఎనిమిది మంది బీట్ ఆఫీస ర్లు దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు అర చేతి లో పెట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటన జరిగినప్ప టి నుంచి అటవీ అధికారులు భయంతోనే విధులు నిర్విహ స్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని అప్పటి అటవీశాఖ అడిషనల్ పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, సీసీఎఫ్ గోపీనాథ్‌తోపాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు, అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ సందర్శించారు. ఉద్యోగులకు న్యా యం జరిగేలా చూస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారి గురించి పట్టించుకున్నవారు లేరు. జాయింట్ సర్వేలను మరిచారు అటవీ సిబ్బంది ప్రాణాలు పోయినప్పుడే ఉన్నతాధికారులకు వారి భద్రత గురించి ఆలోచన వస్తుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల హెక్టార్ల అటవీ భూములు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ భూములలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సంయుక్త సర్వేలను చేపడతామని, వివాదాలను పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు ఇచ్చిన మాటలు నీటి మూటగానే మిగులుతున్నాయి. రిజర్వ్ ఫారె స్ట్ భూములలో సంయుక్త సర్వేలతో హద్దులు గుర్తిస్తే సమస్య పరిష్కారమవుతుంది. కానీ ఇప్పటికి అలాంటి చర్యలు చేపట్టేందుకు అటవీ ఉన్నతాధికారులు ముందుకు రావటం లేదు. ఫారెస్ట్ భూముల్లో వివాదాలు తలెత్తినప్పు డే జాయింట్ సర్వేలు చేస్తామని దాటవేస్తున్నారు. తాము రెవెన్యూ భూ ములనే సాగుచేస్తున్నామని, అయినా అటవీ అధికారులు వేధిస్తున్నారని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. వివాదాస్పద భూములలోకి వెళ్లేందుకు అటవీ సిబ్బంది జంకుతున్నారు. అడ్డుకుంటే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వారికి భద్రత లేకుండా పోయింది. అటవీ సిబ్బం దికి ఆయుధాలు ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. కాని ఇంతవరకు అమలుకాలేదు. దీంతో అటవీ సిబ్బంది భద్రత గాలిలో దీపంగా మిగిలింది.