భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష | Life imprisonment for husband in wife murder | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష

Published Mon, May 1 2017 11:13 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

Life imprisonment for husband in wife murder

ఆదోని రూరల్‌: భార్యను హత్య చేసిన కేసులో ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన కేబీ కాలింగకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2013 మార్చి 3వ తేదీన కాలింగ.. తన భార్య అయ్యమ్మపై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. మృతురాలి వాంగ్మూలం మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు. కేసు విచారణ పూర్తి కావడంతో జిల్లా రెండో అదనపు జడ్జి శ్రీనివాసరావు నిందితుడు కాలింగకు యావజ్జీవ కారాగారా శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. ముద్దాయికి మూడేళ్ల కుమార్తె ఉండటంతో అమ్మమ్మ వాళ్ల దగ్గర ఉంటోంది. మృతురాలి కుటుంబీకుల తరుపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రఫత్‌ వాదించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement