చెన్నై : భర్తను హత్య చేసిన కేసులో భార్యకి, ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్షను పొన్నేరి కోర్టు గురువారం విధించింది. అస్సోం రాష్ట్రానికి చెందిన సుధీప్ తెప్‌నాథ్ (35). ఇతని భార్య అనియాతెప్‌నాథ్ (32). పొన్నేరి సమీపం సెంగుండ్రం బాలవాయల్ గ్రామంలో సుధీప్ తెప్‌నాథ్ తన భార్యతో నివసిస్తూ ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీగా పనిచేస్తుండేవాడు. ఈ స్థితిలో అదే రాష్ట్రానికి చెందిన ప్రైవేటు సంస్థ సెక్యూరిటీ నిర్మల్ సర్కార్ (37)కి అనియా తెప్‌నాథ్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది.
విషయం తెలిసి సుదీప్ తెప్‌నాథ్ భార్యని మందలించాడు. దీంతో ఆవేశం పడి ఆమె తన ప్రియుడు నిర్మల్ సర్కార్‌తో కలసి 2015వ సంవత్సరంలో ఇంట్లో నిద్రపోతున్న సుదీప్ తెప్‌నాథ్‌ని రోకలితో కొట్టి హత్య చేశారు. సెన్‌గుండ్రం పోలీసులు అనియా తెప్‌నాథ్, నిర్మల్ సర్కార్‌ని అరెస్టు చేశారు. ఈ కేసు పొన్నేరి కోర్టులో జరుగుతూ వచ్చింది. కేసు చివరి విచారణ గురువారం జరిగింది. నేరం రుజువుకావడంతో అనియా తెప్‌నాథ్, నిర్మల్ సర్కార్‌కు న్యాయమూర్తి యిరుసన్ పూంగుళలి తీర్పు ఇచ్చారు. అనంతరం పోలీసులు వీరిద్దరిని పుళల్ జైలులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment