పత్రికాత్మక చిత్రం
సాక్షి, నిజామాబాద్ : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగయ్య హత్య కేసులో కోర్టు 14 మందికి జీవితఖైదు విధించింది. అటవీ భూములను ఆక్రమించడాన్ని గంగయ్య అడ్డుకోవడంతో తండా వాసులు ఆయన్ని హత్య చేశారు. ఈ సంఘటన 2013 సెప్టెంబర్ 14న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లితండా అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 37 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 14మందిని దోషులుగా నిర్ధారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు.. జీవితఖైదును విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. మరో 23 మందికి సాధారణ శిక్షలు విధించింది. శిక్ష పడిన 37 మందిలో ఒకరు చనిపోగా.. మరొకరు కోర్టుకు హాజరుకాలేదు.