కోల్‌కతా: దోపిడీకి వెళ్లి, అక్కడే ఉన్న వృద్ధ క్రైస్తవ సన్యాసినిని అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలిన బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాంకు కోల్‌కతాలోని అడిషనల్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఇదే కేసులో దోపిడీకి సంబంధించి దోషులుగా తేలిన మరో ఐదుగురికి శిక్షలు ఖరారు చేసింది. దోపిడీ చేసేందుకు నేరపూరిత కుట్ర పన్నిన కేసులో.. నజ్రుల్ ఇస్లాం, మిలాన్ కుమార్ సర్కార్, ఓహిదుల్ ఇస్లాం, మహ్మద్ సలీమ్ షేక్, ఖలెందర్ రహ్మాన్, గోపాల్ సర్కార్‌లకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. దోపిడీకి పాల్పడిన కేసులో.. నజ్రుల్ ఇస్లాం, మిలాన్ కుమార్ సర్కార్, ఓహిదుల్ ఇస్లాం, మహ్మద్ సలీమ్ షేక్, ఖలెందర్ రహ్మాన్‌లకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment