
వాషింగ్టన్: భార్యను దారుణంగా చంపిన కేరళ వాసికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ, మెరిన్ జోయ్(26) అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. జోయ్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. విభేదాల కారణంగా భార్య తనను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాథ్యూ అక్కసుతో ఉన్నాడు. 2020లో ఆమె కారును అడ్డగించి, కత్తితో 17సార్లు పొడిచాడు.
ఆపై కారుతో ఆమెను తొక్కుకుంటూ తన ఆఫీసుకు వెళ్లిపోయాడు. అక్కడ తన స్నేహితులతో భార్యను కారుతో తొక్కుకుంటూ వచ్చిన విషయాన్ని తెలిపాడు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మెరిన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త అమానుషత్వంపై అధికారులకు వాంగ్మూలమిచ్చింది. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. దీంతో, పోలీసులు మా«థ్యూను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment