kerala man arrested
-
భార్యను 17సార్లు కత్తితో పొడిచి, కారుతో తొక్కించి..
వాషింగ్టన్: భార్యను దారుణంగా చంపిన కేరళ వాసికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ, మెరిన్ జోయ్(26) అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. జోయ్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. విభేదాల కారణంగా భార్య తనను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాథ్యూ అక్కసుతో ఉన్నాడు. 2020లో ఆమె కారును అడ్డగించి, కత్తితో 17సార్లు పొడిచాడు. ఆపై కారుతో ఆమెను తొక్కుకుంటూ తన ఆఫీసుకు వెళ్లిపోయాడు. అక్కడ తన స్నేహితులతో భార్యను కారుతో తొక్కుకుంటూ వచ్చిన విషయాన్ని తెలిపాడు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మెరిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త అమానుషత్వంపై అధికారులకు వాంగ్మూలమిచ్చింది. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. దీంతో, పోలీసులు మా«థ్యూను అదుపులోకి తీసుకున్నారు. -
ఫేస్బుక్లో అమరుడిపై వ్యాఖ్యలు.. అరెస్టు
పఠాన్కోట్లో వీరోచితంగా పోరాడి అమరుడైన ఎన్ఎస్జీ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ ఈకే నిరంజన్ గురించి ఫేస్బుక్లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కేరళలోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అన్వర్ సాదిఖ్ (24) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెవయూర్ పోలీసులు తెలిపారు. అతడు నకిలీ పేరుతో ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసుకున్నాడని, మధ్యమం అనే దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు చెప్పాడని అన్నారు. అయితే తమ పత్రికలో అలాంటివాళ్లు ఎవరూ లేరని పత్రిక వర్గాలు తెలిపాయి. దాంతో పోలీసులు విచారణ జరిపి, సాదిఖ్ను అరెస్టు చేశారు. అతడు ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగా ఉన్నాయని, అయితే తాను చేసింద నేరమన్న విషయం తనకు తెలియదని అతడు చెబుతున్నాడని చెప్పారు. ఫేస్బుక్లో సాదిఖ్ చేసిన వ్యాఖ్యలు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ను అవమానించేలా ఉన్నాయి. వీటితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.