బాలిక గర్భంపై ‘సోషల్‌’ వార్‌.. ఎమ్మెల్యేకు తలనొప్పి   | Raikal: 14 Year Old Employed At TRS Leaders House Gets Pregnant | Sakshi
Sakshi News home page

బాలిక గర్భంపై ‘సోషల్‌’ వార్‌.. ఎమ్మెల్యేకు తలనొప్పి  

Published Sat, May 29 2021 8:41 AM | Last Updated on Sat, May 29 2021 8:50 AM

Raikal: 14 Year Old Employed At TRS Leaders House Gets Pregnant - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రాయికల్‌ మండలంలోని అధికార పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ విషయం వారంరోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత వ్యవహార శైలి ఇదీ అంటూ పేరు ప్రస్తావించకుండా మరోనేత ఫేస్‌బుక్, వాట్సప్‌లో మెసేజ్‌ పెడుతున్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులతోపాటు జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ స్పందించి సోషల్‌ మీడియా వార్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. బాలిక ఫొటో వాట్సప్‌లో పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది.

చదవండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement