
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని గొల్లపల్లిలో బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్తా ముదిరి ఒకరినొకరు దూషించుకుంటూ ఇరు పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ 35 % నుంచి ఏకంగా 43శాతం పెంచిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో ఎన్నో రిక్రూట్‌మెంట్ పూర్తి చేసామని, అలాగే సరైన వాహనాలు లేకపోతే నూతన వాహనాలను అందజేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ప్రశంసించారు. చదవండి: రిసెప్షన్‌కు హెలికాప్టర్‌లో వచ్చాడు!
‘ఆశ వర్కర్ల నుంచి అన్ని రకాల వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరిని ఆదుకుని ఎన్నో విధాలుగా ఆదుకున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే కానీ ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ ఏమి గమనించకపోవడం చాలా బాధకరం. దుబ్బాకలో గెలవడం జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో సగం పైగా గెలిచాం అని చెప్పుకొంటున్నారు. ఆరున్నర ఏళ్లలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి మీడియా ముందుకి వచ్చి చెప్తున్నాము. ప్రజలు గమనిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment