యువకుడి మోసం.. మైనర్‌ బాలిక ప్రసవం | Nizamabad: Police Registered A Case On Young Man Who Cheats Minor Girl | Sakshi
Sakshi News home page

బాలికను మోసం చేసిన యువకుడు

Published Mon, Feb 15 2021 11:53 AM | Last Updated on Mon, Feb 15 2021 12:01 PM

Nizamabad: Police Registered A Case On Young Man Who Cheats Minor Girl - Sakshi

సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్‌): బాలికను లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై నాగిరెడ్డిపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు బాలిక గర్భం దాల్చి ఇటీవలే పాపకు జన్మనిచ్చింది.

కాగా ఆ బాలిక తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందడంతో వరుసకు అక్క అయిన మహిళనే సంరక్షణ బాధ్యత చూస్తోంది. సదరు బాలిక గర్భిణిగా ఉన్న సమయంలో యువకుడు వారికి మాయ మాటలు చెబుతూ వచ్చాడు. అయితే ఆమె ప్రసవించడంతో ఈ విషయం బంధువులకు తెలిసింది. దీంతో వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. 
చదవండి: దోశ పిండి నీ లాగే ఉందంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement