టీకమ్‌గఢ్: మధ్యప్రదేశ్‌లోని టీకమ్‌గఢ్‌లో పొలం పనికి వెళ్లిన 13 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఖర్గపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచెర్ గ్రామంలో ఆగస్ట్ 15వ తేదీన దారుణం చోటుచేసుకుంది. అయితే, బాధిత బాలిక కుటుంబీకులు గురువారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఇన్‌చార్జి మంత్రి కృష్ణ గౌర్‌కి విషయం తెలపడంతో వెలుగులోకి వచి్చంది.
మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, సలీం ఖాన్, లాలూ ఖాన్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత(బీఎన్‌ఎస్)తోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని ఎస్‌పీ రోహిత్ కష్వానీ చెప్పారు. ‘బాధిత బాలిక తండ్రి ఢిల్లీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, గ్రామంలో తల్లి తన పిల్లలతో ఉంటోంది.
ఆగస్ట్ 15న పొలం పనికి వెళ్లిన బాలికను నిందితులు తమ పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు’అని ఖర్గపూర్ స్టేషన్ ఇన్‌చార్జి మనోజ్ ద్వివేది తెలిపారు. బాధిత కుటుంబీకులు రేప్ విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయారనే విషయమై దర్యాప్తు చేపట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment