BJP Leader Son Along With His Friends Molested Young Woman And Assaulted Her Sister In MP - Sakshi
Sakshi News home page

ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్‌.. యువతి ఆత్మహత్యాయత్నం  

Published Sun, Jul 16 2023 4:44 PM | Last Updated on Sun, Jul 16 2023 5:42 PM

Sisters Sexually Abused One Attempts Suicide BJP Leader Son - Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధాతియా జిల్లాలో దారుణం జరిగింది. అధికార బీజేపీ పార్టీ ప్రతినిధి కుమారుడు స్నేహితులతో కలిసి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మైనర్ చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. అవమానభారంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

మధ్యప్రదేశ్ హోం శాఖమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ధాతియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్యకు పాలపడిన తర్వాత విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, భారీ సంఖ్యలో స్థానికులు ఉన్నవ్ పోలీసు స్టేషన్ వద్ద గుమికూడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా స్పందిస్తూ.. ఒకవేళ ఆ అమ్మాయి తన వాంగ్మూలంలో  బీజేపీ నాయకుడి కుమారుడి పేరు చెబితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్ లో.. బీజేపీ లీడర్ కొడుకు తన స్నేహితులతో కలిసి మొత్తం నలుగురు తనను, తన సోదరిని తీసుకుని ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుని వెళ్లారని, అక్కపై సామూహికంగా అత్యాచారం చేసి తనపై కూడా లైంగిక దడి చేశారని తెలిపింది. సంఘటన అనంతరం ఇద్దరూ ఇంటికి చేరుకోగా తన సోదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొంది.   

ధాతియా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని ఒకరు మాత్రం పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుకి చేరువలో ఝాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అన్నారు.    

ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement