మైనర్‌పై లైంగికదాడికి యత్నం: ‘దిశ’తో అరగంటలో నిందితుడు అరెస్ట్‌ | Disha App protected girl within minutes Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Disha Helpline మైనర్‌పై లైంగికదాడికి యత్నం

Published Fri, Sep 24 2021 3:57 AM | Last Updated on Fri, Sep 24 2021 8:07 AM

Disha App protected girl within minutes Andhra Pradesh - Sakshi

లైంగిక దాడికి యత్నించిన సాయిబాబును అరెస్ట్‌ చేసి వివరాలు వెల్లడిస్తున్న సీఐ అంకబాబు

కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ మైనర్‌ బాలికపై లైంగికదాడికి యత్నించిన కామాంధుడు బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి దిశ హెల్ప్‌లైన్‌ నంబర్‌ (112)కు ఫోన్‌ చేయడంతో పోలీసులు అరగంటలోనే ఆ ప్రబుద్ధుడిని వెతికి పట్టుకుని అరెస్ట్‌ చేశారు. సీఐ అంకబాబు వెల్లడించిన వివరాల మేరకు.. బందరు మండలం నవీన్‌మిట్టల్‌ కాలనీకి చెందిన తాడిశెట్టి సాయిబాబు అనే యువకుడు తాపీ పనులు చేస్తుంటాడు. బుధవారం నగరంలోని నారాయణపురంలో నివాసం ఉంటున్న సమీప బంధువు ఇంటికి వెళ్లాడు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

గురువారం ఉదయం బంధువుల ఇంటికి సమీపంలో ఉంటున్న ఓ ఇంట్లోకి చొరబడి నిద్రలో ఉన్న బాలిక (11)పై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు పెట్టడంతో కంగారుపడిన సాయిబాబు చుట్టుపక్కల జనం వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడు. మునిసిపాలిటీలో స్వీపర్‌గా పనిచేసే తల్లి విధులు ముగించుకుని ఇంటికి రాగానే బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది.
చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం

తల్లి దిశ హెల్ప్‌లైన్‌ నంబర్‌ (112)కు ఫోన్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే చిలకలపూడి సీఐ అంకబాబు సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అక్కడక్కడే ఇళ్ల మధ్య తిరుగుతున్న సాయిబాబును అరగంటలో పట్టుకుని అరెస్ట్‌ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. కోర్టుకు హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement