న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే విధంగా యువతులు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ హైకోర్టు చేసిన అభ్యంతరకమైన వ్యాఖ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్టోబర్ 18 2023న హైకోర్టు తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భగా న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడి దర్మాసనం లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం కింద(పోక్సో) కేసుల నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టులు తీర్పులు ఎలా ఇవ్వాలనే దానిపై కూడా జస్టిస్ ఓకా.. ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ 8న హైకోర్టు ఇచ్చిన తీర్పును విమర్శిస్తూ.. అత్యంత అభ్యంతరకరమైన, పూర్తిగా అసంబద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన కొన్ని పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది
కాగా గతంలో .. యవ్వనంలో ఉన్న బాలికలు రెండు నిమిషాల లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంట వ్యాఖ్యానించింది. లైంగిక ఆనందం కోసం లోంగిపోతే సమాజం దష్టిలో నష్టపోయేది యువతులనేని పేర్కొంది. లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి అప్పీల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.
జనవరి 4న ఈ కేసును విచారిస్తున్నప్పుడు, హైకోర్టు తీర్పులోని కొన్ని పేరాగ్రాఫ్‌లు "సమస్యాత్మకమైనవి" అని మరియు అలాంటి తీర్పులు వ్రాయడం "పూర్తిగా తప్పు" అని అత్యున్నత న్యాయస్థానం గమనించింది.
గత ఏడాది డిసెంబరు 8న జారీ చేసిన ఉత్తర్వుల్లో, హైకోర్టు చేసిన కొన్ని పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావిస్తూ, “ప్రథమంగా, ఈ పరిశీలనలు ఆర్టికల్ 21 (జీవించే హక్కు) కింద హామీ ఇవ్వబడిన యుక్తవయస్సులోని యువకుల హక్కులను పూర్తిగా ఉల్లంఘించేవిగా ఉన్నాయి. మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) భారత రాజ్యాంగం."
Comments
Please login to add a commentAdd a comment