Calcutta High Court: జడ్జి వర్సెస్‌ జడ్జి కేసు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం | Judge vs Judge Sc Stayed All Proceedings Before Calcutta High Court | Sakshi
Sakshi News home page

జడ్జి వర్సెస్‌ జడ్జి కేసు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Published Sat, Jan 27 2024 11:37 AM | Last Updated on Sat, Jan 27 2024 11:55 AM

Judge vs Judge Sc Stayed All Proceedings Before Calcutta High Court - Sakshi

కలకత్తా: పశ్చిమ బెంగాల్‌ హైకోర్టులో రెండు బెంచ్‌ల మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పెట్టింది. మెడికల్‌ సీట్ల అడ్మిషన్లలో నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ల స్కామ్‌లో కలకత్తా హై కోర్టులోని  సింగిల్‌ జడ్జి బెంచ్‌ సీబీఐ విచారణకు ఆదేశించగా అలాంటిదేమీ అవసరం లేదని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. డివిజన్‌ బెంచ్‌ నిర్ణయంపై మళ్లీ సింగిల్‌ జడ్జి బెంచ్‌ జోక్యం చేసుకుని డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం అక్రమం, చట్ట విరుద్ధం అని పేర్కొంది. 

దీంతో ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును శనివారం(జనవరి 27) విచారించింది. ఫేక్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హైకోర్టులోని రెండు బెంచ్‌ల ముందు నడుస్తున్న మొత్తం కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారం(జనవరి 29)కి వాయిదా వేసింది.

ఇదీచదవండి..నితీశ్‌ సర్కారు కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement