
సాక్షి, విజయవాడ : నగరంలోని పోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కాగా, 2017లో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పోక్సో యాక్ట్ కింద కృష్ణారావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న తరుణంలో పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.