సాక్షి, విజయవాడ : విజయవాడ ఏసీబీ కోర్టు తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం మండపం వీఆర్‌వో వెంకటరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతొ పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వెంకటరెడ్డి 2015లో రూ.2500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వెంకటరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా 2015లో రూ.2500 లంచం తీసుకోవడం నిజమేనని కోర్టు నిర్థారించింది. దీంతో వెంకటరెడ్డికి శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment