మైనర్‌ కూతురిపై కన్నేసిన తండ్రి.. | Father Molestation On Minor Daughter In Delhi | Sakshi
Sakshi News home page

మైనర్‌ కూతురిపై కన్నేసిన తండ్రి..

Published Sun, Nov 28 2021 3:39 PM | Last Updated on Sun, Nov 28 2021 7:01 PM

Father Molestation On Minor Daughter In Delhi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని చిరాగ్‌ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గత జూన్‌, ఆగస్టునెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఢిల్లీలోని చిరాగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడు సదరు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఒక మైనర్‌ కూతురు ఉంది.

ఈ క్రమంలో ఆ కామాంధుడి కళ్లు అభం శుభం తెలియని కూతురుపై పడ్డాయి. కన్న తల్లి ఇంట్లో లేనప్పుడు కూతురుపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులకు బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో ఆమెను తల్లి ఆసుపత్రకి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. కాగా, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement