ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: వరుసకు కూతురయ్యే బ్యూటీషియన్‌పై అసభ్యంగా ప్రవర్తించిన ఏపీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఏపీకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డి(41) యూసుఫ్ గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఓ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూతురు(17) బ్యూటీషియన్‌గా పని చేస్తోంది.
ఏడాది క్రితం తనకు పెళ్లి కాలేదని నమ్మించి బాధితురాలి తల్లిని రెండో వివాహం చేసుకొని ఆమె ఇంటిని తన పేరుతో రాయించుకున్నాడు. ఆమె కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: పగటిపూట అగ్గి రాజుకుంటే బుగ్గే!!
Comments
Please login to add a commentAdd a comment