ప్రతీకాత్మక చిత్రం
పెనుమూరు(చిత్తూరు జిల్లా): ముక్కపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన పెనుమూరు మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. పెనుమూరు మండలం దాసరాపల్లెకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం పక్కనే ఉన్న మరో చిన్నారితో ఆడుకునేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మూత్ర విసర్జన ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది.
వాళ్లు పరిశీలించి విచారించగా ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలుడు చేసిన అఘాయిత్యం వెలుగుజూసింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించుకుని, అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని శనివారం మాట్లాడుకుందామని సర్దిచెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకంతా ఆ ఇంట్లో వారంతా ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై దిశ, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment