తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది.
కోల్కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని పేర్కొంది.
బేషరతు క్షమాపణలు చెబుతూ తపస్ పాల్ రాసిన లేఖ విచారం వ్యక్తపరిచేలా ఉందని, ఈ వివాదం ముగిసిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ పేర్కొన్నారు. పార్టీ మాత్రమే కాకుండా బెంగాల్ ప్రజలకు, బెంగాల్ మహిళలకు, తన కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.