unconditional apology
-
సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ
అసత్య ప్రమాణం కేసులో భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. బీసీసీఐ సంస్కరణలకు ఉద్దేశించి జస్టిస్ లోధా కమిటీ సమర్పించిన సిఫారసులు అమలు విషయంలో సుప్రీంకోర్టుకు అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడంతో బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి అజయ్ శిర్కేలపై జనవరి 2న అత్యున్నత న్యాయస్థానం వేటువేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అయితే, విచారణకు వ్యక్తిగత హాజరు విషయంలో ఆయనకు మినహాయింపునిచ్చింది. బీసీసీఐ ప్రక్షాళనకు ఉద్దేశించి లోధా కమిటీ ఇచ్చిన సిఫారసుల అమలును అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై ఠాకూర్‌పై సుప్రీంకోర్టు కోర్టుధిక్కరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఠాకూర్‌ను, శిర్కేను పదవినుంచి తొలగించడమే కాదు.. వారిపై అబద్ధపు సాక్ష్యం, కోర్టు ధిక్కార కేసులు ఎందుకు మోపకూడదు తెలుపాలంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే ఠాకూర్ బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. -
చెంప దెబ్బకు అయిదు లక్షలు
ముంబై: బాలీవుడ్ నటుడు గోవింద 2008లో ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించింది. బాధితుడు సంతోష్ రాయ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సంతోష్ రాయ్ ని కలిసి ముఖాముఖిగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం గోవిందాకు రెండు వారాల గడువు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే... 2008లో ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్‌లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా సంతోష్ రాయ్ అనే వ్యక్తి చెంపను గోవిందా చెళ్లుమనిపించాడు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా అనుమతి లేకుండా స్పాట్ లోకి చొచ్చుకు రావడం, అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆగ్రహంతో గోవిందా అతనిపై చేయి చేసుకున్నట్టు సమాచారం. దీంతో గోవిందా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను ఐదారు లక్షలను ఖర్చు చేశానని సంతోష్ రాయ్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో ఉన్నత ధర్మాసనం సంతోష్ రాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ రాయ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది. -
'ఆ ఎంపీని బహిష్కరించాల్సిందే'
కోల్ కతా: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్టీయ జనతాదళ్ పార్టీ(ఆర్ఎల్డీ)నేత అమర్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తృణమూల్ కాంగ్రెస్ కు అపార నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్న ఆమె.. ఆ ఎంపీని పార్టీ నుంచి బయటకు పంపకపోతే రాబోవు రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని విమర్శించారు. ఆర్ఎల్డీ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ఆ ఎంపీపై తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అడిగిన ప్రశ్నకు మండిపడ్డారు. ' మహిళా నేతగా ఉన్న ఆమె సాటి మహిళలపై ఆరోపణలు చేసిన తపస్ పాల్ చర్యలు చేపట్టాలి. తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించడమే ఇందుకు మార్గం' అని అమర్ సింగ్ తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం సరైన పద్దతి కాదన్నారు. 'అతనొక మానసిక వికలాంగుడు. చాలా చెడు వ్యక్తి. పాల్ నుంచి ఒక్క క్షమాపణ ఆశించడం సరికాదు. పార్టీ బహిష్కరణ ఒక్కటే తగిన చర్య'అని ఆయన స్పష్టం చేశారు.ఇకనైనా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. -
పాల్ బేషరతు క్షమాపణకు ఒకే
కోల్‌కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని పేర్కొంది. బేషరతు క్షమాపణలు చెబుతూ తపస్ పాల్ రాసిన లేఖ విచారం వ్యక్తపరిచేలా ఉందని, ఈ వివాదం ముగిసిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ పేర్కొన్నారు. పార్టీ మాత్రమే కాకుండా బెంగాల్ ప్రజలకు, బెంగాల్ మహిళలకు, తన కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. -
వి.కె.సింగ్, ప్రశాంత్ భూషణ్‌లపై ‘ధిక్కార’కేసుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: సైనికదళాల మాజీ అధిపతి జనరల్ వి.కె.సింగ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ల బేషరతు క్షమాపణలను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. అన్నిరకాల తప్పుడు నడవడిక లను మాఫీ చేసే ఉపకరణం పశ్చాత్తాపమని పేర్కొంది. క్షమాపణ హృదయం లోపలినుంచి వచ్చినట్టైతే.. కోర్టు ధిక్కారం అనేది ఇక ఒక సెకను కూడా కొనసాగకూడదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు.. వయసు (పుట్టిన తేదీ) వివాదంపై తామిచ్చిన తీర్పు నేపథ్యంలో కోర్టుపైనా, న్యాయవ్యవస్థపైనా పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జనరల్ వి.కె.సింగ్‌పై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే ఉపసంహరించుకున్నారు. తాము జారీ చేసిన ధిక్కార నోటీసు విషయంలో.. అందులోని యోగ్యత జోలికివెళ్లకుండా వి.కె. సింగ్ తొలి అవకాశాన్నే వినియోగించుకున్నారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. మరోవైపు ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కార కేసు విచారణను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘కోల్గేట్’పై సుప్రీంకోర్టు విచారణను ప్రస్తావిస్తూ తాను చేసిన ప్రకటనలపై భూషణ్ కూడా క్షమాపణ చెప్పారు.