జేమ్స్‌ బాండ్‌ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు | TMC MP Derek Obrien Slams On Modi Over James Bond 007 Poster | Sakshi
Sakshi News home page

జేమ్స్‌ బాండ్‌ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు

Published Tue, Oct 19 2021 11:19 PM | Last Updated on Tue, Oct 19 2021 11:19 PM

TMC MP Derek Obrien Slams On Modi Over James Bond 007 Poster - Sakshi

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని జేమ్స్‌బాండ్‌ 007తో పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ.. జేమ్స్‌ బాండ్‌ వేషధారణలో ఉన్నట్లు ఓ మీమ్‌ను క్రియేట్‌ చేసి ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. మోదీ బాండ్‌ పోస్‌లో ఉన్న మీమ్‌లో.. ‘నన్ను జేమ్స్‌ 007 అని పిలుస్తారు. 0 అభివృద్ది, 0 ఆర్థిక వృద్ధి, 7 ఏళ్ల ఆర్థిక విధ్వంసం’ అని వివరిస్తూ తీవ్రంగా విమర్శించారు.

టీఎంసీ ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం అధకారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏం అభివృద్ది జరగలేదని పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎ​స్టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతూ సామాన్యులకు ఇబ్బందిగా మారుతోందని దుయ్యబట్టారు. ఆయన షేర్‌ చేసినా ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement