మమత.. 'ఛిట్ ఫండ్ మంత్రి' : బీజేపీ
న్యూఢిల్లీ: అభ్యంతకర పదజాలంతో ప్రధాని, ఆర్థిక మంత్రులపై విరుచుకుపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమ పార్టీ నాయకులతో కేంద్రంపై విమర్శలు చేయిస్తున్న మమతా బెనర్జీని 'ఛిట్ ఫండ్ మంత్రి' అని బీజేపీ వర్ణించింది. శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం, బర్ద్వాన్ పేలుళ్ల కేసులో కేంద్రం సాగిస్తున్న దర్యాప్తు తీరును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రిన్ ఇటీవల బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ నాయకులను విమర్శించేందుకు మమత, ఆమె పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. అభ్యంతరకర పదజాలంతో విమర్శలు చేయడంలో మమత, ఇతర పార్టీ నాయకులను డెరెన్ ఓబ్రిక్ మించిపోయారని అన్నారు.