siddharth nath singh
-
మా స్థానాలు, అభ్యర్థుల మార్పులుండవు
సాక్షి, అమరావతి: పొత్తులో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు విషయంలో గానీ, ఆయా స్థానాలకు ఇప్పటికే పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోగానీ ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీట్లు మార్పు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించిన నరసాపురం లోక్‌సభ, అనపర్తి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సోషల్ మీడియాతో పాటు వారి అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిపై సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
-
విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
లక్నో: ప్రభుత్వ ఏజెన్సీల పనితీరు ఎంత దారుణంగా ఉంటుందో చూస్కోండంటూ ఏకంగా ఓ మంత్రే తన ఇంట్లో వర్షపు నీరు లీకేజీ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సిధార్థ్ నాథ్ సింగ్ ఇంట్లో పై కప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. వెంటనే తన ట్విట్టర్ లో ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘మంత్రుల బంగళాలో ఎంత దయనీయమైన స్థితి ఉందో చూడండి. ప్రభుత్వ ఏజెన్సీలపైనే ఇంకా ఆధారపడి ఉన్నాం. మెరుగైన సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సిధార్థ్ ఓ సందేశం ఉంచారు. గత ప్రభుత్వ(అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ) నిర్లక్ష్యం ఇదేనంటూ మంత్రి సిధార్థ్ విమర్శించారు. వంట గదిలో పై కప్పు నుంచి నీరు కారుతుండటం, కింద ఐదు బకెట్లలో వాన నీటిని పడుతుండటం వీడియోలో చూడొచ్చు. -
ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే: నటి
ముంబయి : ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోన్న చిన్నారుల మృతిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ ఆరోగ్య శాఖమంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందక ఇప్పటివరకు 70 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోరకలిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఫేమ్ స్వర భాస్కర్ ట్విట్టర్ ద్వారా ఈ ఘటనపై స్పందించారు. ఇతరులు చేసిన తప్పులకు చిన్నారులు బలవుతున్నారని ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు బాబా రాఘవ్‌దాస్ కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందిపై వేటు వేసిన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు, ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ కూడా బాధ్యులని తెలీదా? ఆయనపై చర్యలు తీసుకోరా? ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
చిన్నారుల మృతిపై మంత్రి వివరణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారులు ప్రాణాలుకోల్పోవడానికి ఆక్సిజన్ లేకపోవడం కారణం కాదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో సీరియస్‌గా దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సున్నితమైనదిగా పరిగణిస్తున్నామని, దాదాపు 3గంటలపాటు సమావేశమై తగిన నిర్ణయాలన్ని తీసుకున్నట్లు తెలిపారు. చాలా అర్ధమంతమైన చర్చలు జరిగాయని, ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతుందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, సున్నితమైనదని చెప్పారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ తక్కువగా ఉందనే విషయం ఎవరూ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ వచ్చినప్పుడు చెప్పలేదని, కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఆస్పత్రితేదనని, ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎందుకు ఆస్పత్రి వర్గాలు బయటకు చెప్పలేదోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించనున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ అందని కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బీడీఎస్ ఆస్పత్రిలో దాదాపు 60మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన సీఎం యోగి ఎంపీగా బాధ్యతలు వహిస్తున్న గోరఖ్‌పూర్‌లోనే చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను ఒక ఊచకోతగా నోబెల్ అవార్డు విజేత కైలాష్ సత్యార్థి అభివర్ణించారు. మరోపక్క, ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ కూడా తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను మోదీ స్వయంగా పరిశీలిస్తున్నారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారని వివరించింది. -
మోదీది సంక్షేమ పాలన
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ అనకాపల్లి: మూడేళ్ల పాలనలో ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోదీఫెస్ట్లో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రోటరీక్లబ్ హాల్లో విలేకర్లతో మాట్లాడుతూ మోదీ మూడేళ్లలో 60 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. 2014లో మోదీ బాధ్యతలు స్వీకరించే నాటికి జీడీపీ 4.8 ఉండేదని, ఇప్పుడు 7కు చేరుకుందంటే నిరుద్యోగ సమస్య తగ్గినట్టేనని పేర్కొన్నారు. 3.5 లక్షల మంది నిరుద్యోగులకు ముద్రా యోజన ద్వారా రుణాలు మంజూరు చేశారని చెప్పారు. లాల్బహుదూర్శాస్త్రికి తాను మనుమడినని, ఆయన పాలనకు మోదీ పాలనకు సారూప్యత ఉందని సిద్ధార్థనాథ్‌సింగ్ అన్నారు. -
ప్రధానితో జగన్ భేటీపై బీజేపీ ఏమంది?
ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసమస్యలపై కలిశారు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలవడంలో తప్పేముందని ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఆయన గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు, పైగా ఆయనకు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిని కలిసే హక్కు ఎవరికైనా ఉంటుంది, అలాంటప్పుడు జగన్ ప్రధానిని కలిస్తే తప్పేమిటి? జగన్‌పై కేసులు ఉంటే కోర్టు చూసుకుంటుంది. దానికీ, మోదీని కలిసిన దానికీ సంబంధమేంటి? ప్రతిపక్ష నేత హోదాలో వివిధ ప్రజా సమస్యలపై ప్రధాని మోదీని కలిశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. ప్రతిపక్ష నేత హోదాలో ఎప్పుడైనా ప్రధానిని కలిసే అవకాశం ఉంటుంది’’ అని సిద్ధార్థనాథ్‌సింగ్ స్పష్టం చేశారు. మోదీతో వైఎస్ జగన్ భేటీపై రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సిద్ధార్థనాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ప్రధానితో జగన్ భేటీపై బీజేపీ ఏమంది?
-
ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: పవన్
హైదరాబాద్: బీజేపీపై జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప అనుభవం ఉన్న నేతలు బీజేపీలో ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దువంటి తప్పిద నిర్ణయం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్య జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియజేస్తూ పవన్ తన ట్విట్టర్ లో స్పందించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి బీజేపీ గట్టిగా స్పందించింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ పవన్‌పై మండిపడుతూ చురకలంటించారు. పవన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. ట్విట్టర్లో స్పందించే ముందు అధ్యయనం చేయాలని ఆయన పవన్‌కు చురకలంటించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఐదు అంశాలపై సమాధానం చెప్పాలని గతంలోనే కోరామన్నారు. గోవధపై ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్నాథ్ సింగ్ గుర్తుకు చేశారు. దీనికి వెంటనే పవన్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. 'నేను సిద్ధార్థ్ సింగ్ గారిని ఒకే ఒక్క సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ పార్టీలో వారికి ఎంతో రాజకీయ అనుభవం ఉండి, రాజ్యాంగంపై నిష్ణాతులై ఉండి ఉంటే పెద్ద నోట్ల రద్దు వంటి ఘోర తప్పిదానికి ఎలా పాల్పడ్డారు. దీనివల్ల తమ తప్పు లేకుండానే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. వీటిపై ఏం సమాధానం చెబుతారు. మీకు నిజంగా ఏదైనా చేయాలని ఉంటే ముందే మీ పార్టీ వాళ్లను పరిమితుల్లో ఉండేలా చేయండి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. -
పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ
-
పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ
ఢిల్లీ: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ట్వీట్లపై భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. పవన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ట్విట్టర్లో స్పందించే ముందు అధ్యయనం చేయాలని ఆయన పవన్‌కు చురకలంటించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఐదు అంశాలపై సమాధానం చెప్పాలని గతంలోనే కోరామన్నారు. గోవధపై ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్నాథ్ సింగ్ గుర్తుకు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ వ్యవహారిస్తున్న తీరుపై పవన్ ట్విట్టర్లో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. (చదవండి : బీజేపీని వదిలి పెట్టం: పవన్ కల్యాణ్ ) -
‘పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై జనసేన అధినేత మరింత అధ్యయనం చేయాలి. ఒకవేళ విమర్శలు చేయాలనుకుంటే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత చేయాలి. అంతేగానీ, కేవలం విమర్శల కోసమే విమర్శలు చేయడం సరికాదు..’ అని బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, సిద్ధార్థనాథ్ సింగ్ కలసి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు నివాసంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. అనంతరం సిద్ధార్థనాథ్‌సింగ్, కామినేని శ్రీనివాస్, హరిబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు.. రెండున్నరేళ్లయినా చేసిందేమీ లేదని, అందిన నిధులు కూడా స్వల్పమేనని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. ‘పవన్ కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా ఆయన సినిమాలు, సినీపరిశ్రమకు నిధులు నెమ్మదిగా వస్తూ ఉండొచ్చు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు మాత్రం అవసరమైన మేరకు వెళుతున్నాయి.’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీలోనే ఎక్కువ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు.‘కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. దానికి చట్టబద్ధత ఉంది. అవసరమనుకుంటే కేబినెట్ ఆమోదం కూడా లభిస్తుందని ఆర్థిక మంత్రి మొదటి రోజే చెప్పారని గుర్తు చే శారు. -
'నాలుగు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా...ఈ కీలక నిర్ణయం'
అమరావతి: చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజు జరిగిన నిర్ణయం కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిపై ఆరేడు నెలలుగా చర్చించి తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో కీలకమైన నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల ముందు కూడా చలామణీలో ఉన్న నోట్ల రద్దు చేయాలన్న కీలక నిర్ణయం ప్రకటించడం ద్వారా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవినీతి నిర్మూలనపై ఉన్న చిత్తశుద్దిని తెలియజేస్తోందని చెప్పారు. ఒకట్రెండు నెలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డబ్బుల ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భవిష్యత్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగే తీరులో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నేతలు బుర్రలేని వ్యక్తులు మాదిరి మాట్లాడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తులే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. -
'వెంకయ్యకు పవన్ సర్టిఫికెట్ అక్కర్లేదు'
-
'వెంకయ్యకు పవన్ సర్టిఫికెట్ అక్కర్లేదు'
సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో బహిరంగసభలు నిర్వహించిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పవన్ సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి కోసం వెంకయ్యనాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, పవన్ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. నార్త్, సౌత్ అని ప్రసంగిస్తున్న పవన్ భారత్‌ను విడగొట్టాలనుకుంటున్నారా అని ఈ సందర్భంగా సిద్ధార్థనాథ్ సింగ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రకటించిన ప్రత్యేక సాయంలో ఏముందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పవన్ బహిరంగసభలో పాల్గొని ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించిన విషయం తెలిసిందే. రాష్ట్ర టీడీపీ, బీజేపీ నేతల వల్ల కాకపోతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం స్వయంగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆ సభలో పవన్ హెచ్చరించారు. -
ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం శనివారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు సిద్దార్థనాథ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగారాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతోపాటు నాయకులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రత్యేక హోదా, కేంద్ర నిధులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
బాబు చెప్పలేదని.. నాతో ఎందుకు చెప్పిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అడగలేదన్న విషయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి సిద్దార్థనాథ్ సింగ్ చెప్పకనే చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడగలేదా అని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి, 'ఆ మాట నా నోటితో ఎందుకు చెప్పిస్తారు.. మా సంకీర్ణ ప్రభుత్వం నేతగా చంద్రబాబు ఏం అడిగారో మీకు తెలుసు కదా? చట్టంలో ఉన్నదాన్ని అమలుచేయాలని చంద్రబాబు చెప్పారు'' అన్నారు. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని స్పష్టం చేశారు. చట్టంలో ఉన్న అన్నింటినీ తాము అమలు చేస్తున్నామని, అసలు విభజన చట్టాన్ని తాము ఎక్కడ ఉల్లంఘిస్తున్నామో చెప్పాలని అన్నారు. ఇదే అంశాన్ని జయంత్ సిన్హా తన లేఖలో పేర్కొంటే.. ఆ లేఖను తప్పుడు కోణంలో ప్రచారం చేశారన్నారు. ఏపీని ప్రత్యేక తరగతి రాష్ట్రంగా కాకుండా.. ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని అనుకుంటున్నామని, ప్రత్యేక తరగతి హోదా అంశానికి ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని తెలిపారు. రైల్వేజోన్ గురించి తాము మాట ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకుంటామని సిద్దార్థనాథ్ సింగ్ అన్నారు. -
బీజేపీ జాతీయ కార్యదర్శికి గాయాలు
కోల్ కతా: పోలీసులతో జరిగిన ఘర్షణలో బీజేపీ నాయకులు గాయపడిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. 'చట్ట అతిక్రమణ' కార్యక్రమంలో భాగంగా నార్త్ 24 పరగణ జిల్లాలోని బరసాత్ లో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ నాథ్ సింగ్ సహా 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తోపులాటలో 10 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు తమపై లాఠిచార్జి చేశారని సిద్ధార్థ నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని విమర్శించారు. రాజకీయ నేతలను, కార్యకర్తలను నేరస్తులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. తీవ్రవాదులు, నేరస్తులను తృణమూల్ కాంగ్రెస్ అల్లుళ్ల మాదిరిగా చూస్తోందని మండిపడ్డారు. లాఠిచార్జి చేయలేదని, తోపులాటలో బీజేపీ నాయకులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దుష్పరిపాలన సాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ 'చట్ట అతిక్రమణ' ఆందోళనకు దిగింది. -
మమత.. 'ఛిట్ ఫండ్ మంత్రి' : బీజేపీ
న్యూఢిల్లీ: అభ్యంతకర పదజాలంతో ప్రధాని, ఆర్థిక మంత్రులపై విరుచుకుపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమ పార్టీ నాయకులతో కేంద్రంపై విమర్శలు చేయిస్తున్న మమతా బెనర్జీని 'ఛిట్ ఫండ్ మంత్రి' అని బీజేపీ వర్ణించింది. శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం, బర్ద్వాన్ పేలుళ్ల కేసులో కేంద్రం సాగిస్తున్న దర్యాప్తు తీరును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రిన్ ఇటీవల బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నాయకులను విమర్శించేందుకు మమత, ఆమె పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. అభ్యంతరకర పదజాలంతో విమర్శలు చేయడంలో మమత, ఇతర పార్టీ నాయకులను డెరెన్ ఓబ్రిక్ మించిపోయారని అన్నారు.