విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
Published Mon, Aug 28 2017 12:06 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM
లక్నో: ప్రభుత్వ ఏజెన్సీల పనితీరు ఎంత దారుణంగా ఉంటుందో చూస్కోండంటూ ఏకంగా ఓ మంత్రే తన ఇంట్లో వర్షపు నీరు లీకేజీ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సిధార్థ్ నాథ్ సింగ్ ఇంట్లో పై కప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. వెంటనే తన ట్విట్టర్ లో ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘మంత్రుల బంగళాలో ఎంత దయనీయమైన స్థితి ఉందో చూడండి. ప్రభుత్వ ఏజెన్సీలపైనే ఇంకా ఆధారపడి ఉన్నాం. మెరుగైన సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సిధార్థ్ ఓ సందేశం ఉంచారు. గత ప్రభుత్వ(అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ) నిర్లక్ష్యం ఇదేనంటూ మంత్రి సిధార్థ్ విమర్శించారు.
వంట గదిలో పై కప్పు నుంచి నీరు కారుతుండటం, కింద ఐదు బకెట్లలో వాన నీటిని పడుతుండటం వీడియోలో చూడొచ్చు.
Advertisement
Advertisement