తెలంగాణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కోల్కతా: తెలంగాణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము దేశ సమగ్రత కోరుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్ను విభజించే చేసే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ తెలిపారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు కోల్కతా వచ్చే అవకాశముందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో విభజన బిల్లుపై ఆయన చర్చలు జరపనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మమతా బెనర్జీని కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని ఆమెను కోరారు.