కీలక రాష్ట్రాల్లో ’ఇండియా‘కు అనూహ్య లీడ్ | Sakshi
Sakshi News home page

యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ’ఇండియా కూటమికి లీడ్

Published Tue, Jun 4 2024 12:13 PM

Nda Trails In Up Maharashtra Tamilnadu Kerala

న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంగళవారం 12 గంటల వరకు వెలువడ్డ ఫలితాలు బీజేపీకి కొంత మేర నిరాశ కలిగించినట్లు కనిపిస్తోంది. భారీ విజయం సాధిస్తామనుకున్న వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. 

ఈసారి సొంతగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటడం బీజేపీకి అంత సులువుకాదని ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు ఫలితాల్లో బీజేపీ సొంతగా 238 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సొంతగా 95 స్థానాల్లో, ఇండియా  కూటమి 230 సీట్లలో లీడ్‌లో కొనసాగుతోంది. 

ఇతరులు 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఎన్డీఏ,ఇండియా కూటముల వారిగా చూసుకుంటే ఎన్డీఏ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలు బీజేపీ దూకుడుకు కళ్లెం వేశాయి. యూపీలో ఇండియా కూటమి 42, మహారాష్ట్రలో 28, తమిళనాడు 37, కేరళ 17 సీట్లలో లీడ్‌లో కొనసాగుతూ ఎన్డీఏ కూటమిపై ఆధిక్యాన్ని ప్రదిర్శిస్తోంది. 

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ బీజేపీపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ  బీజేపీకి  ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్డీఏలకు భారీ  మెజారిటీ వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్త తప్పినట్లు తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement